
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న మూవీ స్పిరిట్ (Spirit). ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొణెను తప్పించారనే న్యూస్ జాతీయ మీడియాల్లో చక్కర్లు కొడుతుంది. ఆమె పెట్టిన కండిషన్స్కు హర్ట్ అయిన సందీప్ రెడ్డి మరో హీరోయిన్ వేటలో పడినట్లు టాక్ వినిపించింది.
లేటెస్ట్గా స్పిరిట్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. దీపికా పదుకునే స్థానంలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ను తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇపుడీ ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
'కల్కి '2898 AD'లో ప్రభాస్తో దీపికా నటించింది. కానీ, ఫుల్ లెంత్ రోల్లో ప్రభాస్తో చిందేయ్యలేదు. దాంతో దీపికా పదుకొణె, 'స్పిరిట్' లోనూ హీరోయిన్గా నటిస్తే చూడాలని తెలుగు ఆడియన్స్ అందరూ భావించారు. అయితే, ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి పలు కారణాలు చెబుతున్నారు.
నేషనల్ మీడియా రిపోర్ట్ ప్రకారం,
మొదటిది, దీపికా 8 గంటల వర్కింగ్ షిఫ్ట్,
రెండోది, రూ.20 కోట్ల రెమ్యు సరేషన్, సినిమా లాభాల్లో వాటా,
మూడోది, తెలుగు డైలాగ్స్ చెప్పడానికి నిరాకరణ
నాలుగోది వందరోజుల్లో తన పార్ట్ షూటింగ్ పూర్తవ్వకపోతే ఆ తర్వాత షూట్ జరిగే ప్రతి రోజుకు అదనంగా రెమ్యునరేషన్ చెల్లించాలట.
ఈ విషయంలో దీపికపై కొన్ని విమర్శలు వస్తున్నా, ఆమెను సపోర్ట్ చేసేవాళ్లు కూడా లేకపోలేదు. ఇటీవల తల్లయిన దీపిక.. తన పాపతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇలాంటి రూల్స్ పెడుతోందని సమర్దిస్తున్నారు.
ఇన్ని రూల్స్‌తో షూటింగ్ చేయడం జరిగే వ్యవహారం కాదని భావించిన సందీప్ రెడ్డి.. ఆమెతో కాంట్రాక్ట్ రద్దు చేసుకుని మరో హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. దీంతో ఆమె స్థానంలో రుక్మిణి వసంత్ ను తీసుకునేందుకు మూవీ టీం చర్చలు జరుపుతోందని టాక్.
#SPIRIT : #RukminiVasanth in Discussion For Female Lead😍❤️🔥#DeepikaPadukone Opted Out!! pic.twitter.com/rUhrAkEiNf
— Heyopinions (@heyopinionx) May 23, 2025
2019లో బిర్బల్ ట్రిలాజీ' సినిమాతో రుక్మిణి వసంత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ‘777 చార్లీ’,2023లో 'సప్త సాగరదాచే ఎల్లో' సినిమాలతో ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో ప్రియ పాత్రలో ఆమె నటనకు ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ కూడా దక్కింది. ప్రస్తుతం ఎన్టీఆర్-నీల్ మూవీలో కూడా హీరోయిన్గా రుక్మిణీ నటిస్తున్నట్లు సమాచారం.