కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏ.ఎం. రత్నం సమర్పణ లో దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన మూడు పాటలు, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 18న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించారు.
లవ్, ఎమోషన్స్, కామెడీ, మ్యూజిక్‌తో కలగలిసిన విందుభోజనం లాంటి చిత్రమిది అంటున్నారు దర్శక నిర్మాతలు. కుటుంబ ప్రేక్షకులను, యువతను ఆకట్టుకునేలా ఉంటుందని నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ సెకెండ్ వీక్‌లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నాడు.