రెండో పెళ్లికి సిద్ధమైన ఐశ్వర్య?

రెండో పెళ్లికి సిద్ధమైన ఐశ్వర్య?

రజనీకాంత్​ కుమార్తె, కోలీవుడ్​ నిర్మాత ఐశ్వర్య(Ishwarya) రెండో పెళ్లి చేసుకోనుందనే వార్త వైరలవుతోంది. కోలీవుడ్​ స్టార్​ హీరో ధనుష్(Dhanush)​ను పెళ్లాడిన ఆమె ఇటీవల భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత పెద్దల జోక్యంతో ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గనట్టు వార్తలొచ్చాయి. అయితే, ఇప్పుడు ఐశ్వర్య రెండో పెళ్లి వార్త వైరలవుతోంది. ఇందులో నిజం లేదని ఆమె సన్నిహిత వర్గాలు తాజాగా క్లారిటీ ఇచ్చాయి.

ఓ కోలీవుడ్​ హీరోతో ఐశ్వర్య ప్రేమలో ఉందనే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నరిసార్టు ఫొటోలు బయటకు వచ్చినట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇక కొన్నేళ్ల కిందట సుచీ లీక్స్​ పేరుతో లీకైన ఫొటోల్లో ధనుష్​ ఓ హీరోయిన్​తో క్లోజ్​గా ఉండటమే ఐశ్వర్యతో బంధంలో చీలికలు తెచ్చినట్టు టాక్​ నడుస్తోంది. ఇక అప్పటినుంచే వీరిద్దరి మధ్య  గొడవలు ముదిరి విడాకులకు దారితీసిందని కోలీవుడ్​ వర్గాలు పేర్కొంటున్నాయి.