ఆల్-టైమ్ కనిష్టానికి రూపాయి.. డాలర్‌‌‌‌‌‌‌‌ మారకంలో 88.47కి పతనం

ఆల్-టైమ్ కనిష్టానికి రూపాయి.. డాలర్‌‌‌‌‌‌‌‌ మారకంలో 88.47కి పతనం

ముంబై: భారత రూపాయి, యూఎస్​ డాలర్​తో పోలిస్తే  గురువారం 36 పైసలు తగ్గి రూ. 88.47 వద్ద  ఆల్​-టైమ్​ కనిష్టానికి పడిపోయింది. ఇండియా, యూఎస్​ మధ్య కొనసాగుతున్న సుంకాల సమస్య దీనికి ప్రధాన కారణం. అమెరికా ద్రవ్యోల్బణ డేటాకు ముందు డాలర్​ కోలుకోవడం, విదేశీ నిధులు వెనక్కి వెళ్లిపోవడం వంటివి రూపాయిపై ఒత్తిడి పెంచాయి.  

ముడి చమురు ధరలు పెరగడం కూడా రూపాయి పతనానికి దారితీసింది. ఇంటర్​బ్యాంక్​ విదేశీ మారకంలో రూపాయి 88.11 వద్ద ప్రారంభమై, ఇంట్రాడే ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యూఎస్​ డాలర్​తో పోలిస్తే 88.47 వద్ద ఆల్-టైమ్​ కనిష్టానికి పడిపోయింది. దాని మునుపటి ముగింపుతో పోలిస్తే 36 పైసలు పడిపోయి, 88.47 వద్ద రికార్డు కనిష్ట స్థాయిలో ముగిసింది.  తదనంతరం కొద్దిగా కోలుకొని 88.35కి చేరింది.