బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువే.. కానీ స్క్రీన్‌పై.? : హీరో, నిర్మాత రూపేశ్ కామెంట్స్

బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువే.. కానీ స్క్రీన్‌పై.? : హీరో, నిర్మాత రూపేశ్ కామెంట్స్

రూపేష్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘షష్టిపూర్తి’. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో పవన్ ప్రభ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 30న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా రూపేష్ మాట్లాడుతూ ‘కుటుంబ విలువలతో కూడిన  కథ ఇది. ఇటీవల కాలంలో హింసతో కూడిన చిత్రాలే ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి స్ర్కిప్ట్ నా దగ్గరకు రావడాన్ని ఎంతో ఆనందించాను.

ఈ చిత్రాన్ని నిర్మించడం ఆనందంగానే ఉన్నా.. నటించడాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేశా. ఇందులోని పాత్రలను ప్రేక్షకులు తమను తాము చూసుకున్నట్టుగా కనెక్ట్ అవుతారు. కుటుంబ అంశాలతో పాటు అన్ని రకాల ఎమోషన్స్‌‌ను చూపించాం.

ఈ కథను రాజేంద్ర ప్రసాద్ గారి కోసమే పవన్ ప్రభ రాసుకున్నారు. ఆయన కొడుకుగా నటించడం చాలా సంతోషంగా ఉంది. ఇళయరాజా గారి మ్యూజిక్‌‌తో సినిమా స్థాయి పెరిగింది. ఆయన మాకు ఎంతో సహకరించారు. ప్రతీ పాటకు ఎన్నో ఆప్షన్స్ ఇచ్చారు. అలాగే  కీరవాణి గారు అడిగిన వెంటనే ఓ పాటను రాసి ఇచ్చారు. ఇందులోని  పాటలు, ఆర్ఆర్ ఆడియెన్స్‌‌ను కదిలిస్తాయి.

కథలో బలం ఉందనే ఇళయరాజా గారు, తోట తరణి గారు ఒప్పుకున్నారు. దానికి తగ్గట్టే మంచి అవుట్‌‌పుట్ వచ్చింది.  బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువే అయింది. అయితే ఆ ఖర్చు పెట్టింది అంతా కూడా తెరపై కనిపిస్తుంది.

అయితే ఎవ్వరూ కూడా ఇంత ఇవ్వాలని డిమాండ్ చేయలేదు. నాన్ థియేట్రికల్ ద్వారా మంచి బిజినెస్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నాం. ఇక్కడి స్పందనను చూసి ఓవర్సీస్‌‌లో కాస్త ఆలస్యంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం’అని చెప్పాడు.