ప్రజల్ని సేఫ్ ప్లేస్‌కు తరలిస్తున్న బస్సుపై దాడులు

ప్రజల్ని సేఫ్ ప్లేస్‌కు తరలిస్తున్న బస్సుపై దాడులు

ఉక్రెయిన్, రష్యా మధ్య 13 రోజులుగా భీకర యుద్ధం సాగుతోంది. ఉక్రెయిన్ సిటీలపై రష్యా నిత్యం క్షిపణులు, బాంబు దాడులకు పాల్పడుతోంది. దీంతో తమపై ఎక్కడ ఏ బాంబులు వచ్చిపడుతాయోనని ఉక్రెయిన్ ప్రజలతో పాటు విదేశీయులు.. సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ లో రిస్క్ ఉన్న కొన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలనూ ఆ దేశ ప్రభుత్వం సేఫ్ ప్లేస్ లకు తరలిస్తోంది. ఇవాళ కొన్ని ప్రాంతాల్లోని ప్రజలను బస్సుల్లో తరలిస్తుండగా.. రష్యా షెల్ దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. కీవ్ రీజియన్ లోని పలు గ్రామాలపైనా దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ముగ్గురు సామాన్యులు గాయపడినట్లు తెలిపారు.
 

మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరో వీడియో విడుదల చేశారు. తాను దేశం విడిచి వెళ్లినట్లు..  పారిపోయినట్లు.. తాను చనిపోతే ప్రత్యామ్నాయాలు ఏర్పాట్లు చేసినట్లు.. రకరకాల వార్తలు వస్తుండడంపై స్పందించారు. సోమవారం రాత్రి సమయంలో ఈ వీడియోను తీసినట్లు కనిపిస్తోంది. తాను కీవ్ నగరంలోని తన కార్యాలయంలోనే సురక్షితంగా ఉన్నానని జెలెన్ స్కీ సెల్ఫీ వీడియోతో నగర వీధులను అద్దాల్లో  నుంచి చూపుతూ.. తన కార్యాలయంలోని సీట్లో ఆసీనమై మాట్లాడే వీడియోను పోస్టు చేశారు. పాతది అనుకునే అవకాశం లేకుండా.. కొన్ని గంటల క్రితం జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ మట్లాడారు.

మరిన్ని వార్తల కోసం..

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

మత పిచ్చిగాళ్లను బంగాళాఖాతంలో విసిరేయాలి

నిరుద్యోగులు టీవీ చూడండి.. రేపు అసెంబ్లీలో ప్రకటన చేస్త