మోడీకి రష్యా అత్యున్నత అవార్డు

మోడీకి రష్యా అత్యున్నత అవార్డు

రష్యా దేశంలో అత్యున్నత అవార్డు ‘ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూ ది అపాజిల్‌’కు భారత ప్రధాని మోడీ ఎంపికయ్యారు. ఈ అవార్డును ఈ ఏడాది మోడీకి ఇవ్వనున్నట్లు రష్యా రాయబార కార్యాలయం ఇవాళ(శుక్రవారం) ప్రకటించింది. ఈ అవార్డును రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో అసాధారణ సేవలు అందించినందుకు ఇస్తారు.

ప్రధాని మోడీ అనేక ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. గతేడాది దక్షిణకొరియా దేశం సియోల్‌ శాంతి బహుమతి, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ జాయెద్‌ మెడల్‌కు మోడీ ఎంపికయ్యారు. ఈ అవార్డును మోడీకి ఇవ్వనున్నట్లు ఆ దేశాధ్యక్షులు.. ఖలీఫా బిన్‌ జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ ప్రకటించారు. భారత్‌, యూఏఈల మధ్య వ్యూహాత్మక బంధాలను బలోపేతం చేయడంలో మోడీ కీలక పాత్ర పోషించారని అందుకే ఆయనను జాయెద్‌ మెడల్‌తో సత్కరించనున్నట్లు అరబ్‌ దేశం తెలిపింది.