వాక్సిన్ ను సిఫార్సు చేయలేం: డబ్ల్యూ హెచ్ వో

వాక్సిన్ ను సిఫార్సు చేయలేం:  డబ్ల్యూ హెచ్ వో

సేఫ్టీ ట్రయల్స్​ చేయాల్సిందే

రష్యా వ్యాక్సిన్ పై సేఫ్టీ ట్రయల్స్​ చేయాల్సిందేనని డబ్ల్యూ హెచ్ వో తేల్చి చెప్పింది. ఏ దేశానికి చెందిన ప్రొడక్ట్​ అయినా సేఫ్ , ఎఫికసీ అని తేల్చేందుకు దాన్ని జాగ్రత్త గా పరీక్షించాల్సి ఉంటుందని పేర్కొంది. బుధవారం సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జార్బాస్ బార్బోసా మీడియాతో మాట్లాడారు. రష్యా వ్యాక్సిన్ పై ఇంకా అన్ని టెస్టులు చేయలేదని, కాబట్టి ఇప్పుడే సిఫార్సు చేయలేమని చెప్పారు. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్​ డేటాను రివ్యూ కోసం ఆ దేశ అధికారులతో చర్చిస్తున్నామన్నా రు. రివ్యూ చేశాక ఆ డేటాలో ట్రాన్స్​పరెన్సీ ఉందనిపిస్తేనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.