
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో ‘మిలిటరీ ఆపరేషన్’ ప్రారంభించనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన తర్వాత బంగారం ధర గురువారం ఉదయం దాదాపు రూ.1,656 వరకు పెరిగి రూ. 51,000 మార్కుకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం రేటు 2.02 శాతం పెరిగి రూ. 51,627కి చేరుకుంది. వెండి ధర రూ.2,350 వేల వరకు పెరిగి రూ.66,267 దగ్గర ఆగింది. బంగారం రేట్లలో సిటీల వారీగా తేడా ఉంటుందనే విషయం తెలిసిందే. రష్యా– ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న టెన్షన్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను భయపెట్టింది. ఈ పరిస్థితుల కారణంగా బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగిందని ఐసీఐసీఐ డైరెక్ట్ ఒక రిపోర్టులో పేర్కొంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం కూడా గోల్డ్ రేట్ల పెరుగుదలకు కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎనలిస్టు ఒకరు అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో, స్పాట్ బంగారం ధర ఔన్సుకు 1.9 శాతం పెరిగి 1,943.86 డాలర్లకి చేరుకుంది. జనవరి 2021 తరువాత ఇదే అత్యధిక స్థాయి. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 2 శాతం పెరిగి 1,949.20డాలర్లకి చేరుకుంది. ఫిబ్రవరిలో ఇప్పటి వరకు పసిడి దాదాపు 8 శాతం పెరిగింది. ఉక్రెయిన్‌లో రష్యా దాడి తర్వాత ముడి చమురు ధరలు, డాలర్ మారకం విలువ పెరిగాయి.
ఇక నుంచి కూడా బుల్లిష్‌గానే..
"ఇన్ఫ్లేషన్తోపాటు యుద్ధం కారణంగా బంగారం కొనుగోళ్లు ఎక్కువయ్యాయి. రష్యాపై అమెరికా, యూరోప్ ఆంక్షల తరువాత ట్రెజరీ దిగుబడులు పెరగడం ఆగింది. యూఎస్, యూరోపియన్ యూని యన్, బ్రిటన్ బ్యాంకులు రష్యాలను ఉన్నత వర్గాలను లక్ష్యంగా చేసుకునే ప్లాన్లను ప్రకటించాయి. అయితే జర్మనీ రష్యా నుండి వచ్చే ఒక ప్రధాన గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌ను నిలిపివేసింది. మరికొన్ని ట్రేడింగ్ సెషన్ల వరకు బంగారం బుల్లిష్ జోన్‌లోనే ఉండవచ్చు. రూ. 50,400 టార్గెట్ కోసం రూ. 50,100 దగ్గర బంగారాన్ని కొనడం మంచిది. సెల్జోన్ రూ. 49,800లకు దిగువన పెట్టుకోండి. టార్గెట్ రూ. 49,500లుగా పెట్టుకోండి”అని షేర్‌ఇండియా వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ హెడ్ రవి సింగ్ అన్నారు. "ఉక్రెయిన్ చుట్టూ టెన్షన్లు తీవ్రతరం అయ్యాయి. బంగారానికి డిమాండ్ పెరగడంతో ఆసియా మార్కెట్లలో గురువారం ఉదయం అంతర్జాతీయ గోల్డ్ స్పాట్ ఫ్యూచ ర్లు ర్యాలీ చేశాయి. కామెక్స్ గోల్డ్ ఏప్రిల్ 1904.80 డాలర్ల స్థాయి కంటే ఎక్కువ ట్రేడింగ్ చేస్తే అది 1918.50‑1926.60 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ జోన్ వరకు బుల్లిష్ మొమెంటంను చూడవచ్చు. దిగువన ఉన్న ట్రేడింగ్ ధరలను 1896.70–1883.00 డాలర్ల వద్ద సపోర్ట్ జోన్‌కు లాగవచ్చు" అని రిలయన్స్ సెక్యూరి టీస్‌లోని సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ శ్రీరామ్ అయ్యర్ అన్నారు. ఎంసీఎక్స్ గోల్డ్ ఏప్రిల్ రూ. 50,250 స్థాయి కంటే ఎక్కువ ట్రేడ్ అయినట్ల యితే, అది రూ. 50,545-–50,710 వద్ద రెసిస్టెన్స్ జోన్ వరకు బుల్లిష్‌గా ఉంటుందని అయ్యర్ ఈ సందర్భంగా వివరించారు.