
మాస్కో: స్పుత్నిక్ వీ పేరుతో రష్యా కరోనా వ్యాక్సిన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ ఉత్పత్తిపై రష్యా దృష్టి సారించింది. అందుకే బ్రెజిల్, ఇండియా సహా మరికొన్ని దేశాల్లోని కంపెనీలతో చర్చలు నిర్వహించింది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. తాజా సమాచారం ప్రకారం.. ప్రతి నెలా 1.5 నుంచి 2 మిలియన్ డోసులను తాము ఉత్పత్తి చేయనున్నట్లు రష్యా ఎక్స్‌పర్ట్స్ చెప్పారు. ఆ తర్వాత వేగం పెంచి నెలకు 6 మిలియన్ (60 లక్షలు) డోసులు తయారు చేసేలా ప్లాన్స్ చేస్తున్నట్లు ఆర్‌ఐఏ న్యూస్ ఏజెన్సీతో రష్యా మినిస్టర్ డేనిస్ మంతురోవ్ చెప్పారని సమాచారం. మాస్కోలోని గమలెయా ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన స్పుత్నిక్ వీని భారీ సంఖ్యలో దాదాపు 40 వేల మందిపై ప్రయోగించడానికి రష్యా సిద్దమవుతోంది.