‘స్పుత్నిక్‌ వీ’ వ్యాక్సిన్‌ అప్‌డేట్:‌ వచ్చే వారంలో 40 వేల మందిపై ప్రయోగం!

‘స్పుత్నిక్‌ వీ’ వ్యాక్సిన్‌ అప్‌డేట్:‌ వచ్చే వారంలో 40 వేల మందిపై ప్రయోగం!

మాస్కో: రష్యాలో కరోనా వ్యాక్సిన్‌ను భారీ సంఖ్యలో ప్రజలపై ప్రయోగించనున్నారు. డొమెస్టిక్ అప్రూవల్ కోసం స్పుత్నిక్‌ వీ అనే ఈ వ్యాక్సిన్‌ను వచ్చే వారంలో 40 వేల మందిపై టెస్ట్ చేయనున్నారు. ఈ ప్రయోగాన్ని ఫారెన్ రీసెర్చ్ బాడీ పర్యవేక్షించనుందని తెలిసింది. ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన దేశంగా సోవియట్ యూనియన్‌ నిలిచింది. అయితే వ్యాక్సిన్ ప్రభావం, సేఫ్టీని తెలుసుకునేందుకు రాబోయే రెండు నెలల్లో స్మాల్‌ స్కేల్ హ్యూమన్ ట్రయల్స్‌ చేయడానికి సైంటిస్టులు సమాయత్తం అవుతున్నారు. అయితే వెస్టర్న్ ఎక్స్‌పర్ట్స్‌ మాత్రం స్పుత్నిక్‌ వీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్నేషనల్‌గా టెస్టింగ్‌ అప్రూవల్ పొందాకే దాన్ని సక్సెస్‌ అయినట్లు గుర్తించాలన్నారు. అంతర్జాతీయంగా ఆమోదం పొందాకే సదరు వ్యాక్సిన్‌ను వినియోగించాలని హెచ్చరిస్తున్నారు. అయితే చాలా దేశాలు రష్యన్ వ్యాక్సిన్‌పై సమాచార యుద్ధం చేస్తున్నాయని రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌‌డీఐఎఫ్‌) హెడ్ కిరిల్ దిమిత్రేవ్ స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను వెనకేసుకొచ్చారు. వ్యాక్సిన్‌కు సంబంధించిన డేటాను అకడెమిక్ జర్నల్‌లో వచ్చే నెలలో ప్రచురిస్తామని ఆయన స్పష్టం చేశారు.