రష్యా వ్యాక్సిన్ తో .. మస్తు యాంటీబాడీలు

రష్యా వ్యాక్సిన్ తో .. మస్తు యాంటీబాడీలు

అడినో వైరస్ ల‌తో రెండు వెక్టర్లుగా వ్యాక్సిన్ తయారీ
ఆ వెక్టర్లలోకి కరోనా వైరస్
ఎస్ప్రొటీన్లోని జీన్ వ్యాక్సిన్ పేరుతోనే వెబ్ సైట్ పెట్టిన రష్యా.. వ్యాక్సిన్ పై వివరణ
2 వేల మందిపై మొదలైన వ్యాక్సిన్ ఫేజ్3 ట్రయల్స్
ఫస్ట్ డోసుగా ఏడీ26.. రెండో డోసుగా ఏడీ5
‘స్పుత్నిక్V’ 2 డోసులు వేసుకుంటే యాంటీ బాడీలు పెరుగుతాయని రష్యా వివరణ ఇచ్చింది.

మాస్కో: ఫస్ట్ క‌రోనా వ్యాక్సిన్ స్పుత్నిక్Vపై ప్రపంచ దేశాలు ఎన్నెన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. రష్యా ప్రభుత్వం ఆ వ్యాక్సిన్ పేరు మీదే sputnikvaccine.com అనే వెబ్ సైట్ ను ప్రారంభించింది. వ్యాక్సిన్ పై ఇంటర్నేషనల్ మీడియా చేస్తున్న చెడు ప్రచారాలను తిప్పి కొట్టేందుకు, ఎప్పటికప్పుడు స్పుత్నిక్Vకు సంబంధించిన అప్డేట్లు, కచ్చితమైన సమాచారం ఇచ్చేందుకే వెబ్ సైట్ ను ఓపెన్ చేసినట్టు చెప్పింది. ఆ వెబ్ సైట్లో వ్యాక్సిన్ ను ఎట్ల తయారు చేసింది.. అది ఎట్ల పని చేసేదన్న వివరాలను వెల్లడించింది.
రెండు డోసులతో ఇమ్యూనిటీ పెరుగుదల
రెండు వెక్టర్ల‌తో స్పుత్నిక్Vను తయారు చేసింది. గమాలియా రీసెర్చ్ఇనిస్టిట్యూట్స్. మనుషుల్లోని అడినాయిడ్స్ ల్లో ఉంటూ జలుబుకు కారణమయ్యే అడినో వైరస్ల నుంచి ఆ వెకర్ట్లను తీసుకుంది. ఆ వెక్టర్లలో జెనెటిక్ మెటీరియల్ అంటూ ఏమీ ఉండదు. అయితే, వేరే వైరస్ లోని జీన్ను ఆ వెక్టర్ లో పెట్టి కణాల్లోకి పంపిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే వీటిని ట్రాన్స్ పోర్టర్స్ అని అనొచ్చు. వాటివల్ల బాడీకి ఎలాంటి ప్రమాదం ఉండదు. స్పుత్నిక్Vవ్యాక్సిన్ విషయంలో ఏడీ26, ఏడీ5 అనే రెండు వెక్టర్లను తీసుకుంది గమాలియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్. ఒంట్లో కరోనా వైరస్ రెప్లికేషన్ కు కారణమయ్యే.. ఆ వైరస్ కొమ్ముల్లోని ఎస్ ప్రొటీన్లో ఉండే జీన్ను కట్ చేసి ఆ రెండు వెక్ట‌ర్ల‌లో పెట్టింది. ఫస్ట్ డోసులో భాగంగా ఏడీ26 టైప్ వెక్టర్ వ్యాక్సిన్ ను ఇస్తారు. కణాల్లోకి వెళ్లిన‌ ఏడీ26 నుంచి ఎస్ ప్రోటీన్ రిలీజ్ అవుతుంది. ఆ ఎస్ ప్రొటీన్ ను మన ఇమ్యూనిటీ గుర్తించి యాంటీబాడీలను ప్రొడ్యూస్ చేస్తుంది.తర్వాత 21 రోజులకు రెండో డోసు కింద ఏడీ5 టైప్ వెక్టర్ వ్యాక్సిన్ ను వేస్తారు. ఈ రెండో డోస్ తో చాలా కాలం పాటు ఉండే ఇమ్యూనిటీ వస్తుందని, యాంటీబాడీలు పెరుగుతాయని జీఆర్ఐ చెబుతోంది.

ఫేజ్3 ట్రయల్స్ మొదలైనయ్

వ్యాక్సిన్పై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నది ఫేజ్3 ట్రయల్స్ పైనే. అవి చేయకుండా వ్యాక్సి న్ ను ఎట్లా రిలీజ్ చేస్తారని ప్రశ్నిస్తున్నాయి. అయితే, బుధవారం (ఆగస్టు12) నుంచే ఫేజ్3 ట్రయల్స్ మొదలుపెట్టినట్టు వెబ్ సైట్లో జీఆర్ఐ పేర్కొంది. రష్యా, యూఏఈ, సౌదీ అరేబియా, బ్రెజిల్, మెక్సికోలకు చెందిన 2 వేల మందికిపైగా వాలంటీర్ల‌పై ట్రయల్స్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే రెండు జాతుల కోతులు సహా జంతువులపై ప్రి క్లినిక‌ల్ ట్రయల్స్ చేశామని పేర్కొంది. ఆగస్టు1న ఫేజ్1, ఫేజ్ 2 ట్రయల్స్ పూర్తయ్యాయని చెప్పింది. ఆ ట్రయల్స్ లో పాల్గొన్న వలంటీర్లందరూ ప్రస్తుతం బాగున్నారని తెలిపింది. ట్రయల్స్లో పాల్గొన్నవాళ్ల‌లో ఒక్కరికి కూడా కరోనా సోకలేదని చెప్పింది. రక్తంలోని యాంటీబడీలను టెస్ట్ చేశాకే.. వాళ్లలో కరోనాకు ఇమ్యూనిటీ పెరిగినట్టు తేల్చామని చెప్పింది.

సెప్టెంబర్ నుంచి ప్రొడక్షన్
సెప్టెంబర్ ప్రారంభం నుంచి వ్యాక్సి న్లను పెద్ద సంఖ్యలో ప్రొడ్యూస్ చేస్తామని వెబ్ సైట్లో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) పేర్కొంది. ఏలియమ్ గ్రూప్ కు చెందిన ఆర్ఫార్మ్, బిన్నోఫార్మ‌ల‌తో ఒప్పందం చేసుకున్నట్టు చెప్పింది. ఇండియా, సౌత్కొరియా, బ్రెజిల్, సౌదీ అరేబియా, టర్కీ, క్యూబా వంటి దేశాల్లో ఫేజ్3 ట్రయల్స్ చేయడంతో పాటు అ క్కడే వ్యాక్సి న్ ను తయారు చేస్తామని పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికి రష్యాలో 3 కోట్ల డోసులు సహా ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల డోసులను తయారు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించింది. ఇండియా సహా 20 దేశాలు ఆసక్తి చూపించినట్టు చెప్పింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం