మాస్కో: సముద్రంపైన షికారుకెళుతున్న భారీ పడవలా కనిపిస్తోంది కానీ నిజానికిదో న్యూక్లియర్ రియాక్టర్.. ప్రపంచంలోనే నీటి మీద తేలే తొలి రియాక్టర్ ఇదే. ఆర్కిటిక్‌లోని పెవెక్టౌన్లో పాడైపోయిన న్యూక్లియర్ప్లాంట్కు అల్టర్నేటివ్గా ఉపయోగించుకోవడానికి రష్యా దీనిని తయారుచేసింది. 2006లో తయారీ మొదలెడితే ఇప్పటికి సిద్ధమైంది. శుక్రవారం పెవెక్వైపు ప్రయాణం మొదలెట్టింది కూడా.. ఆర్కిటిక్ ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. అలాంటి చోట న్యూక్లియర్ ప్లాంట్కట్టడం కన్నా ఇదే మేలని రష్యా చెబుతోంది. అయితే, పర్యావరణవేత్తలు మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీటిమీద తేలే ఈ ప్లాంటు మరో చెర్నోబిల్లాంటిదని అంటున్నారు. అణు ఇంధనంతో ప్రయాణంచేసే ఈ పడవ పొరపాటున ప్రమాదానికి గురైతే భారీ నష్టం తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ ప్రయాణాన్ని వెంటనే ఆపేయాలని డిమాండ్చేస్తున్నారు. మంచు ఖండం మీద చెర్నోబిల్‌ను ఉంచినట్లేనని ఆందోళన చెందుతున్నారు. ప్రయాణం మధ్యలో ఈ నౌక ఇతర పడవనో, మంచు పర్వతాన్నో ఢీ కొంటే నాటి చెర్నోబిల్ఘటన రిపీట్అవుతుందని రష్యాను హెచ్చరిస్తున్నారు. మిలటరీ టెస్టింగ్‌సెంటర్ లో ఈమధ్య జరిగిన ప్రమాదాన్ని, అది సృష్టించిన రేడియోయాక్టివ్సర్జ్ను వారు గుర్తుచేస్తున్నారు. రష్యా మాత్రం ఈ ఆందోళనలను లెక్కచేయడంలేదు.
