మాస్కో/కీవ్: ఉక్రెయిన్ తమను రెచ్చగొడుతోందని, మూడో ప్రపంచ యుద్ధం రావాలని కోరుకుంటోందని రష్యా మండిపడింది. అణ్వాయుధాలను ప్రయోగించే విషయంలో తమ దేశాన్ని తక్కువ అంచనా వేయవద్దని, ఉక్రెయిన్ ఇట్లనే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే అణ్వాయుధాలను ప్రయోగించేందుకు వెనుకాడబోమని హెచ్చరించింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో రైలు, ఆయిల్ స్థావరాలను టార్గెట్ చేసుకుని దాడు లు ముమ్మరం చేసినట్టు రష్యా రాయబారి ఒకరు వెల్లడించారు. రష్యా ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందించలేదు. అయితే ఖార్కివ్ సహా చాలా నగరాలపై రష్యా షెల్లింగ్ కొనసాగుతోందని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ వెల్లడించారు. కాగా, ఖిర్సన్ రీజియన్‌లో రష్యా సేనల కంట్రోల్లో ఉన్న వెలికా ఒలెగ్జాండ్రికా గ్రామాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రష్యాకు చెందిన ఒక ఆయుధాగారాన్ని ధ్వంసం చేశామని, 70 మంది సైనికులను మట్టుబెట్టామని చెప్పారు.
మా గ్రామంపై దాడులు చేస్తోంది
బార్డర్‌కు దగ్గర్లోని తమ గ్రామంపై ఉక్రెయిన్ దాడుల కు పాల్పడుతోందని రష్యా ఆరోపించింది. ‘‘ఒక గ్రామాన్ని టార్గెట్ చేసుకుని ఉక్రెయిన్ దాడులు చేస్తోంది. అక్కడ ఇద్దరు పౌరులు గాయపడ్డారు. చాలా ఇండ్లు ధ్వంసమయ్యాయి”అని బెల్గోడ్ రిజియన్ గవర్నర్ వ్యచస్లావ్ గ్లాడ్కోవ్ చెప్పారు.
రష్యాకు ఎగుమతులపై మరిన్ని ఆంక్షలు: బ్రిటన్
ఉక్రెయిన్ నుంచి తమ దేశానికి వచ్చే అన్ని రకాల వస్తువులపై టారీఫ్‌లను తగ్గించినట్టు బ్రిటన్ వెల్లడించింది. అదే సమయంలో రష్యాకు టెక్నాలజీకి సంబంధించిన కొన్ని ఎగుమతులపై బ్యాన్ విధించినట్టు తెలిపింది. ఉక్రెయిన్‌లో దాడులకు రష్యాకు ఈ టెక్నాలజీ సహకరిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. జెలెన్స్కీ విజ్ఞప్తి ప్రకారం ఈ నిర్ణయాలు తీసుకున్నామని యూకే ఇంటర్నేషనల్ ట్రేడ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
కాల్పులు ఆపండి: గుటెరస్
ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ పాటిం చాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను కోరారు. మంగళ వారం మాస్కోలోలావ్రోవ్తో గుటెరస్ సమావేశమై తాజా పరిస్థితులపై చర్చిం చారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనడాని కి, చర్చల ప్రక్రియను తిరిగి ప్రారంభించే లా చేయడానికి తాము దారులు వెతుకు తున్నామని గుటెరస్ చెప్పారు. శాంతి యుత పరిష్కారంకోసం అందరూ సహకరించాలని కోరారు. ఉక్రెయిన్‌లో పరిస్థితుల వల్ల ప్రపంచ ఆహార భద్రతపై ప్రభావం పడకుండా ఉండేందుకు చర్య లు తీసుకుంటున్నామని చెప్పారు.షెడ్యూల్ ప్రకారం ఈ వారంలోనే గుటెరస్ కీవ్‌లో కూడా పర్యటించాల్సి ఉంది. మరోవైపు, మరియుపోల్‌లో చిక్కుకున్న జనాలను సేఫ్ ప్లేసులకు తరలించేందుకు సాయం చేయాలని ఉక్రెయిన్ ఐక్యరాజ్య సమితిని కోరింది.
