ర్యాన్‌‌ ట్యాక్స్‌‌ సర్వీసెస్‌‌లో 400 కొత్త ఉద్యోగాలు

ర్యాన్‌‌ ట్యాక్స్‌‌ సర్వీసెస్‌‌లో 400 కొత్త ఉద్యోగాలు

హైదారాబాద్‌‌, వెలుగు: గ్లోబల్‌‌ ట్యాక్స్‌‌ సర్వీసెస్‌‌ కంపెనీ ర్యాన్‌‌  హైదరాబాద్‌‌లో 19 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండో సెంటర్‌‌ను మంగళవారం ప్రారంభించింది. మొదటి సెంటర్‌‌‌‌ మాదాపూర్‌‌‌‌లోని అసెండాస్‌‌ వీ పార్క్‌‌లో ఉండగా, ఈ కొత్త ఆఫీస్‌‌ను సాలర్‌‌‌‌ పూరియా సత్వా నాలెడ్జ్‌‌ సిటీలో ఏర్పాటు చేశారు. కంపెనీకి ఇండియాలో ఉన్న రెండు సెంటర్లు హైదరాబాద్‌‌లోనే ఉన్నాయి. ఇండియాలో కంపెనీని విస్తరించడానికి గత కొన్నేళ్లలో  రూ. 21.30 కోట్లను ఖర్చు చేశామని చైర్మన్‌‌, సీఈఓ బ్రింట్‌‌ ర్యాన్‌‌ అన్నారు.  గ్లోబల్‌‌గా ఉన్న క్లయింట్లకు హైదరాబాద్‌‌ సెంటర్‌‌‌‌ ద్వారా సేవలందిస్తామని తెలిపారు . మొదటిసారి 2013 లో హైదరాబాద్‌‌లో మా గ్లోబల్‌‌ సపోర్ట్‌‌ సెంటర్‌‌‌‌ను ప్రారంభించామని బ్రింట్‌‌ అన్నారు. అప్పుడు 166 మందితో ప్రారంభమయ్యామని, ప్రస్తుతం ఆ నెంబర్‌‌‌‌ 520 కి చేరుకుందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్‌‌లో మా ఉద్యోగులు 580 కి చేరుకుంటారని తెలిపారు. గ్లోబల్‌‌గా కంపెనీకి 2,700 ఉద్యోగులుండగా, ఇందులో హైదరాబాద్‌‌ మొదటి సెంటర్‌‌‌‌లోనే 520 మంది పనిచేస్తున్నారని బ్రింట్‌‌ అన్నారు. హైదరాబాద్‌‌ సెంటర్‌‌‌‌ మాకు కీలకమని, ఇక్కడి నుంచి గ్లోబల్‌‌గా ఎసెట్‌‌రికవరీ, డేటా ప్రాసెసింగ్‌‌, కమర్షియల్‌‌ ప్రాపర్టీ ట్యాక్స్ సేవలను అందిస్తున్నామని అన్నారు. వచ్చే 18 నెలల్లో  ఇండియాలో మా ఉద్యోగుల సంఖ్య 800–900కి చేరుకుంటుందన్నారు. ర్యాన్‌‌ ట్యాక్స్‌‌ సర్వీసెస్‌‌ కంపెనీ గ్లోబల్‌‌గా క్లయింట్లకు ట్యాక్స్‌‌ సేవలను, సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ను అందిస్తోంది. ఈ కంపెనీకి 50 దేశాలలో 77లోకేషన్లలో సెంటర్లున్నాయి. కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా15,000 మంది కస్టమర్లున్నారు.