రైతు బంధు రెండో రోజు 1,255 కోట్లు

రైతు బంధు రెండో రోజు 1,255 కోట్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:యాసంగి రైతు బంధు రెండో రోజు రూ.1,255.42 కోట్ల నిధులు రైతుల ఖాతాలలో జమ చేశారు. బుధవారం 17లక్షల 31వేల 127 మంది రైతులకు ఎకరానికి రూ.5వేల చొప్పున నగదు బదిలీ చేశారు. దీంతో మంగళ, బుధవారం 2 రోజులు కలిపి 35 లక్షల 43వేల 783 మంది రైతుల అకౌంట్లకు రూ.1,799.99 కోట్లు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ చేశారు. దీంతో ఇప్పటి వరకు 2ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతుబంధు అందినట్లయింది.
వ్యవసాయరంగాన్ని ఉపాధిరంగంగా చూడాలె: మంత్రి నిరంజన్‌‌‌‌రెడ్డి
రాష్ట్రంలో రూ.60 వేల కోట్లు వ్యవసాయ రంగం మీద ఖర్చుపెడుతున్నట్లు మంత్రి నిరంజన్‌‌‌‌రెడ్డి చెప్పారు. కరోనాతో ఆదాయం తగ్గిపోయినా ప్రభుత్వం రైతుబంధు కొనసాగిస్తోందన్నారు. ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ఉపాధి రంగంగా చూడాల్సిన అవసరం ఉందని వివరించారు. రైతు బంధుతో
పంట సాగు, దిగుబడులు పెరిగాయని చెప్పారు.