కౌలు రైతులు సంక్షోభంలో ఉన్నారు

కౌలు రైతులు సంక్షోభంలో ఉన్నారు

గద్వాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను పట్టించుకోకపోవడంతో వారు సంక్షోభంలో ఉన్నారని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకుడు రవి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం టీఎన్జీవోస్​ బిల్డింగ్ లో ‘కౌలు రైతుల వేదన విందాం రండి’ అనే అంశంపై పబ్లిక్  హియరింగ్  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల మంది కౌలు రైతులు సంక్షోభంలో ఉన్నారని, వారందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

1960 నుంచి 2011 వరకు కౌలు చట్టాలను అమలు చేయకపోవడంతో అప్పల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కౌలు రైతులకు గుర్తింపుకార్డు ఇవ్వాలని, రైతు బీమా, రైతుబంధుతో పాటు పకృతి వైపరీత్యాలకు పంటలు దెబ్బతింటే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్  ఇక్బాల్ బాషా, గోపాల్, నవీన్, రేవతి, ఆంజనేయులు పాల్గొన్నారు.