మహిళల ఆత్మగౌరవం కోసం కేసీఆర్ పని చేస్తుండు

మహిళల ఆత్మగౌరవం కోసం కేసీఆర్ పని చేస్తుండు

రంగారెడ్డి: బతుకమ్మ చీరల విషయంలో కొంతమంది కావాలనే రాద్దాంతం చేస్తున్నారని, బతుకమ్మ చీరల్లో నేతన్నల కష్టాన్ని చూడాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని పలు ప్రాంతాల్లో మహిళలకు మంత్రి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. జిల్లాలో మొత్తం 4 లక్షల 50 వేల చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మహిళల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. మిషన్ భగీరథతో నీటి కష్టాలు దూరం అయ్యాయని ... కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ వంటి పథకాలతో కేసీఆర్ మహిళల ఆత్మగౌరవాన్ని పెంచారని అన్నారు.

బతుకమ్మ చీరల వల్ల వేల మంది నేతన్నలు బాగుపడుతున్నారనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కమిషనర్ కృష్ణమోహన్ రె,డ్డి స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.