Kitchen Telangana :ఎండాకాలం వంటలు..సాబుదానా రెసిపీస్.. ఆరోగ్యంతో పాటు శరీరం చల్లగా ఉంటుంది..!

Kitchen Telangana :ఎండాకాలం వంటలు..సాబుదానా రెసిపీస్.. ఆరోగ్యంతో పాటు శరీరం చల్లగా ఉంటుంది..!

ఎండాకాలంలో మన శరీరానికి చల్లదనాన్నిచ్చే పదార్థాలు ఎన్నో ఉంటాయి.. అందులో సాబుదానా (సగ్గుబియ్యం) కూడా ఉంది. సాబుదానా ఒంట్లోని వేడిని అప్పటికప్పుడు తగ్గించేస్తుంది. సాబుదానాలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. అవన్నీ వేసవిలో మనల్ని ఎండ నుంచి రక్షిస్తాయి. అలాంటి సాబుదానాతో జావ మాత్రమేకాకుండా... పలురకాల వంటలు ట్రై చేయొచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం..

సాబుదానా కిచిడి తయారీకి కావాల్సినవి

 

  • సాబుదానా- ఒక కప్పు 
  • అలుగడ్డ (ఉడికించి, మెదిపి) -అరకప్పు
  • పల్లీలు-పావు కప్పు
  • కొత్తిమీర తరుగు - పావు కప్పు
  • టొమాటో తరుగు - పావు కప్పు 
  • పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్
  • పసుపు - చిటికెడు
  • కారం- అర టీ స్పూన్
  • మిరియాల పొడి - అర టీ స్పూన్
  • ఉప్పు - తగినంత
  •  జీలకర్ర- పావు టీ స్పూన్
  • ఆవాలు- పావు టీ స్పూన్

సాబుదానా కిచిడి తయారీ విధానం

సాబుదానాను రెండుసార్లు నీళ్లలో కడిగి ఐదు గంటలు నానబెట్టాలి. తర్వాత నీళ్లను వడగట్టి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. దాంట్లో ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. స్టవ్ వెలిగించి పాన్​ లో నూనె వేడి చేయాలి, జీలకర్ర, ఆవాలు వేయాలి. తర్వాత పల్లీ లను వేగించాలి.

ఇప్పుడు పచ్చిమిర్చి, టొమాటో తరుగు, పసుపు. కారం చేసి మగ్గించాలి. ఆలుగడ్డ మిశ్రమం సాబుదానా కూడా వేసి కలపాలి చివరగా కొత్తిమీర తరుగు వేయాలి. నిమ్మరసం చల్లు ముని తింటే, రుచి అదిరి పోతుంది.

సాబుదానా టెక్కీ ల తయారీకి కావలసినవి

  • సాబుదాన- అర కప్పు
  • ఆలుగడ్డ( ఉడికించి మెదిపి)- అరకప్పు
  • పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్
  • కారం- పావు టీ స్పూన్
  • కొత్తమీర తరుగు - పావు కప్పు
  • ఆమ్ చూర్ పొడి - పావు కప్పు
  • పసుపు-చిటికెడు
  • ఉప్పు- తగినంత
  • నూనె -సరిపడ

సాబుదానా టెక్కీ ల తయారీ విధానం

సాబుదానాను సుమారు ఆరు గంటలు నానబెట్టాలి. ఒక గిన్నెలో ఆలుగడ్డ బెట్టిన సాబుదానా, పచ్చిమిర్చి తరుగు.. కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఆమ్ మార్ పొడి, కొత్తిమీద తరుగు వేసి బాగా కలపాలి.

స్టవ్ వెలిగించి పాన్​ లో నూనె వేడి చేయాలి. సాబుదానా మిశ్రమాన్ని చేతుల్లోకి కొద్దికొద్దిగా తీసుకుని గారెల్లా వత్తుకోవాలి వాటిని నూనెలో డీప్ ఫ్రై వేయాలి. ఈ టెక్కీలను సాస్ లేదా కొబ్బరి చట్నీతో తింటే భలే రుచిగా ఉంటాయి.

►ALSO READ | కిచిడీ, పెరుగు అన్నం.. ఇవి కేవలం భోజనం కాదు, మన శరీరానికి 'నేచురల్ రెమెడీస్..