ప్రజల తెలంగాణ రావాలంటే.. కాంగ్రెస్ ను గెలిపించాలి

ప్రజల తెలంగాణ రావాలంటే.. కాంగ్రెస్ ను గెలిపించాలి

హైదరాబాద్ : ప్రజల తెలంగాణ రావాలంటే  కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్. తెలంగాణ అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. హైదరాబాద్ వచ్చిన సచిన్ పైలట్ మీడియాతో మాట్లాడారు. ఐదేండ్లు దేశాన్ని పాలించిన బీజేపీ, రాష్ట్రాన్ని పాలించిన టీఆర్ఎస్.. ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. టీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, ముస్లింలపై దాడులు పెరిగాయన్నారు. ఆఖరికి పుల్వామా ఘటనను బీజేపీ రాజకీయం చేసిందన్నారు సచిన్ పైలట్.

పేదలకు రూ.15 లక్షలు ఇస్తామన్న మోఢీ.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పేద కుటుంబానికి ఏడాదికి రూ.72 వేలు ఇస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఐదేళ్లలో చేసిన వృద్ధి ఏమిటో బీజేపీ, టీఆర్ఎస్ చెప్పాలని సచిన్‌ పైలట్‌ డిమాండ్‌ చేశారు. బీజేపీ పాలనలో దళితులు, ముస్లింలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు సచిన్ పైలట్.