World Cup 2023 Final : ఫైనల్‌కు ముందు విరాట్ కోహ్లికి సచిన్ గిఫ్ట్

World Cup 2023 Final : ఫైనల్‌కు ముందు విరాట్ కోహ్లికి సచిన్ గిఫ్ట్

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు మరికాసేపట్లో ప్రారంభం అవుతున్నందన్న క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్.. భారత బ్యాటింగ్ మాస్ట్రో విరాట్ కోహ్లికి అపురూపమైన బహుమతి అందజేశారు. టాస్ వేయడానికి ముందు ప్రాక్టీస్ చేస్తున్న విరాట్ కోహ్లి వద్దకు వెళ్లిన సచిన్.. తన జెర్సీని కోహ్లికి అందజేశాడు. 2011 ప్రపంచకప్ గెలిచిన సమయంలో తాను ధరించిన జెర్సీని కోహ్లీకి గిఫ్టుగా అందజేశాడు. జెర్సీమీద విరాట్.. నువ్వు మా అందరినీ గర్వపడేలా చేశావంటూ.. సచిన్ సంతకం చేసి మరీ కోహ్లీకి కానుకగా అందించాడు. ఫైనల్ మ్యాచ్‌కు ముందు తన హీరో నుంచి అపురూపమైన బహుమతి అందేసరికి కింగ్ కోహ్లి    మురిసిపోయాడు.

ఈ సందర్భంగా కొన్ని అందమైన చిత్రాలను పంచుకోవడానికి బీసీసీఐ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'కి వెళ్లింది. "ఒక ప్రత్యేక సందర్భం & ఒక ప్రత్యేక ప్రీ-మ్యాచ్ మూమెంట్. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీకి తన చివరి ODI నుంచి సంతకం చేసిన జెర్సీని బహుమతిగా ఇచ్చాడని BCCI తన ఎక్స్ పోస్ట్‌లో క్యాప్షన్ గా చేర్చింది.

ఈ ఫొటోల్లో ఒకదానిటో కోహ్లీ తన చేతుల్తో జెర్సీ పట్టుకొని, అందరికీ చూపిస్తున్నటుగా ఉంది. మరొక చిత్రంలో ఆయన.. తనను సచిన్ కౌగిలించుకున్న ఫొటోను చూస్తున్నట్టు కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. ఇండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కొందరు నెటిజన్లు, క్రీడాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.