త్వరలో వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహం

త్వరలో వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహం

టీమిండియా క్రికెటర్  సచిన్ టెండూల్కర్ కు అరుదైన గౌరవం దక్కనుంది. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నారు. సచిన్ త్వరలో 50 ఏళ్లు  పూర్తి చేసుకోబోతున్న  నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్  ఈ నిర్ణయం తీసుకుంది.  సచిన్ పుట్టిన రోజైన ఏప్రిల్ 23న లేదా ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే  ప్రపంచకప్ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే వెల్లడించారు. ఇప్పటికే సచిన్ నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నట్లుగా ఆయన తెలిపారు. వాంఖడే స్టేడియంలో ఇదే మొదటి విగ్రహం కానుంది. కాగా ఇప్పటికే ఈ స్టేడియంలో సచిన్ పేరు మీద ఓ స్టాండ్ కూడా ఉంది. కాగా సచిన్  భారత్ తరఫున 200 టెస్టు మ్యాచ్‌లు, 463 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (100) , పరుగులు 34,357 చేశాడు.