ODI World Cup 2023: అతని సలహాతోనే ధోనీని కెప్టెన్ చేశారు: బీసీసీఐ సెక్రటరీ జైషా

ODI World Cup 2023: అతని సలహాతోనే ధోనీని కెప్టెన్ చేశారు: బీసీసీఐ సెక్రటరీ జైషా

టీం ఇండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా ఎన్నో చిరస్మరణీయ, చారిత్రాత్మక విజయాలను అందించిన సంగతి తెలిసిందే. కెప్టెన్సీ చేపట్టిన తొలి ప్రయత్నంలోనే భారత్ ని జగజ్జేతగా నిలిపిన మహీ.. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, అందించాడు. తన కెప్టెన్సీతో ఎన్నో అసాధ్యమైన మ్యాచ్ లను కూడా సుసాధ్యాలుగా మార్చిన మహేంద్రుడు.. భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. అయితే భారత్ కు ఇన్ని విజయాలను అందించిన ధోనీని కెప్టెన్ చేయమని చెప్పింది ఎవరో తాజాగా బీసీసీఐ సెక్రటరీ జైషా చెప్పుకొచ్చాడు. 

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ జయ్‌ షా ధోనీని ఎవరు కెప్టెన్ గా నియమించాలని సూచించారో చెప్పేసాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీకి ఎంఎస్ ధోనీ పేరును సూచించింది సచిన్ టెండూల్కర్ అని ఆయన అన్నారు.ముంబైలోని వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జే షా ఈ విషయాన్ని వెల్లడించారు. బోర్డు సభ్యుడిగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు సచిన్ ను  చాలాసార్లు సంప్రదించానని బీసీసీఐ సెక్రటరీ చెప్పుకొచ్చాడు.

ALSO READ :- ODI World Cup 2023: 15 మందిలో ఐదుగురికి గాయాలు.. ఇక కోచ్‌లు, సిబ్బందిని దించాల్సిందే!

2004 డిసెంబర్ లో వన్డేలో అరంగ్రేట్రం చేసిన ధోనీ.. ఆ తర్వాత స్టార్ బ్యాటర్ గా ఎదిగాడు. అయితే 2007 లో వన్డే వరల్డ్ కప్ పరాజయం తర్వాత సెహ్వాగ్, యువరాజ్ఎం జహీర్ ఖాన్ లాంటి సీనియర్లు ఉన్నా.. వారందరిని కాదని అనుభవం లేని ధోనీని కెప్టెన్ గా నియమించడం అప్పట్లో సంచలంగా మారింది. కానీ కట్ చేస్తే ఇండియాలోనే బెస్ట్ కెప్టెన్ గా మారాడు మహేంద్రుడు. మరి అప్పుడు సచిన్ ధోనీలో ఏం గమనించాడో తెలియదు గాని టీమిండియాకు మాత్రం గొప్ప కెప్టెన్ దొరికేసాడు.