కూటమిలో కొనసాగుతూ బిల్లులపై రాజకీయమా?

కూటమిలో కొనసాగుతూ బిల్లులపై రాజకీయమా?

చండీగఢ్: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై శుక్రవారం దేశ వ్యాప్తంగా రైతులు నిరసనలు తెలిపారు. భారత్ బంద్‌‌లో భాగంగా చాలా చోట్ల రైతులు బిల్లులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. పంజాబ్, హర్యానాల్లో కూడా రైతులు, విపక్ష నేతలు బిల్లులపై ఉద్యమించారు. అయితే పంజాబ్‌‌లో నిర్వహించిన రైల్ రోకోకు శిరోమణి అకాళీదల్ రాజకీయ రంగు పులిమిందని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నేతలు ఆరోపించారు. బీజేపీతో కూటమిలో కొనసాగుతూ బిల్లులపై రైతులతో రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ‘అకాళీ దల్ స్పష్టమైన వైఖరిని అవలంబించడం లేదు. ఎన్‌‌డీఏతో భాగస్వామ్యంలో ఉంటూనే రాజకీయాలు చేస్తోంది’ అని కమిటీ జనరల్ సెక్రటరీ సర్వాన్ సింగ్ పంధేర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.