
సూర్యాపేట, వెలుగు: సోమవారం జరగబోయే సద్దుల బతుకమ్మ పండుగలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద జరిగే సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు మున్సిపల్ కమిషనర్ సీహెచ్ హనుమంత రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో అతిపెద్ద, రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తోందన్నారు. డీజే సౌండ్ సిస్టమ్, లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గుప్తా, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.