
సిరిసిల్ల జిల్లాకేంద్రంలో మంగళవారం సంబురంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని వివిధ ఏరియాలకు చెందిన మహిళలంతా జంక్షన్ల వద్దకు చేరి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. బతుకమ్మ ఘాట్ వద్ద వేలాది మంది మహిళలు బతుకమ్మ ఆడి నిమజ్జనం చేశారు. పట్టణంలోని నేతన్న విగ్రహం వద్ద బతుకమ్మ ఆడి సందడి చేశారు. -రాజన్నసిరిసిల్ల, వెలుగు