
కరీంనగర్ జిల్లాలో సద్దుల బతుకమ్మ హడావుడి మొదలైంది..జిల్లాలోని కొన్ని చోట్ల సద్దుల బతుకమ్మ పండుగను ఇవాళే(సెప్టెంబర్29) నిర్వహిస్తున్నారు. దీంతో పూల మార్కెట్లు కస్టమర్లతో కిక్కిరి పోయాయి. పండుగ సీజన్ కావడంతో పూలకు ధరలు పెరిగిపోయాయి. బంతిపూల ధర కిలోకు రూ. 200 చొప్పున విక్రయిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పూల కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా మారాయి. పూలనే దేవునిగా భావించే ఈ బతుకమ్మ పండుగ.. దీంతో బతుకమ్మ పండుగకు పూలు కొనుగోలు చేసేందుకు మహిళలు పెద్ద ఎత్తున మార్కెట్లకు తరలివస్తున్నారు. అయితే పూలకు డిమాండ్ ఉండటం, వానల కారణంగా ఉత్పత్తి తగ్గడంతో ధరలు బాగా పెరిగాయి.
ALSO READ : నా డ్రెస్సింగ్ రూమ్‌లో 14 ఉన్నాయి..
మరోవైపు జగిత్యాల జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో ఇవాళే సద్దుల బతుకమ్మ పండుగ చేస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పూల మార్కెట్లు కిక్కిరిశాయి. పూల పండుగ అయిన బతుకమ్మ పండుగకు బంతిపూలకు కిలో రూ. 200 పైనే ధర పలుకుతోంది.