
న్యూఢిల్లీ: రేమండ్ లిమిటెడ్ గ్రూప్‌కి చెందిన మైనీ ప్రిసిషన్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఎంపీపీఎల్) గురువారం ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్‌తో లాంగ్‌టెర్మ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సీఎఫ్‌ఎం లీప్ ఇంజన్ కోసం అసెంబుల్డ్ ప్రొడక్ట్స్‌ను సరఫరా చేయనుంది.
ఎంపీపీఎల్ ఇప్పటికే సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్ (ఎస్‌ఏఈ)కి టర్బైన్ వేన్స్, ఫోర్జ్డ్, మెషిన్డ్ మెటాలిక్ ప్రొడక్ట్స్‌ను సరఫరా చేస్తోంది. ఈ రెండు కంపెనీలు ఒక ఎంఓయూపై గురువారం సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో ఏరోస్పేస్ మాన్యుఫాక్చరింగ్ సప్లయ్ చెయిన్‌లో ఇండియా తన ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడానికి వీలుంటుందని ఎస్‌ఏఈ పేర్కొంది.
'మేక్ ఇన్ ఇండియా' ఇనీషియేటివ్ మరింత బలపడుతుందని తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం, ఎంపీపీఎల్ సింగిల్- ఐల్ (చిన్న విమానాల) కమర్షియల్ జెట్స్‌కు పవర్ ఇచ్చే సీఎఫ్‌ఎం లీప్ ఇంజన్ కంబస్టర్స్ కోసం మెషిన్డ్ అసెంబ్లీలను తయారుచేస్తుంది. ఈ ఒప్పందం మొదట ఐదేళ్ల పాటు ఉంటుంది.