ప్రతిపాదనల్లోనే ​సాగర్ బ్యూటిఫికేషన్​!

ప్రతిపాదనల్లోనే ​సాగర్ బ్యూటిఫికేషన్​!
  • అభివృద్ధికి ప్రతిపాదనలు ఉన్నా.. అమలు కాని కార్యచరణ
  • కొత్తగా కనిపించని రిక్రియేషనల్ జోన్లు
  • సండే స్పాట్​కు పెరిగిన సందర్శకులు
  • పెద్దగా ఆకట్టుకోని టూరిజం స్పాట్లు

హుస్సేన్​సాగర్ ను మరింత డెవలప్ చేస్తం. ఆ బాధ్యతలను హెచ్ఎండీఏకు ఇస్తున్నం.” అని రెండేండ్ల కిందట మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఆ వెంటనే హెచ్ఎండీఏ డీపీఆర్ రెడీ చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వ పర్మిషన్​కోసం వెయిట్​చేస్తోంది. ఇందులో ఏ ఒక్క ప్రాజెక్టు పనులు కూడా మొదలు పెట్టలేదు.’’ 

“ట్యాంక్​బండ్​పై  స్ట్రీట్ లైట్లు, ఫుట్ పాత్ లు తప్పా చూసేందుకు ఏమి లేవు. చిన్న పిల్లలతో వస్తే బోర్ కొట్టేలా ఉంది. పిల్లలను ఆకట్టుకునే ఆట వస్తువులు ఉంటే ఫ్యామిలీతో వచ్చేందుకు ఇంట్రెస్ట్​చూపిస్తరు.” అంటూ రెండు వారాల కిందట ట్యాక్​బండ్​ పిక్నిక్​ స్పాట్​కు వచ్చిన విద్యానగర్ కు చెందిన ప్రవీణ్ కుమార్ వ్యక్తం చేశాడు. 

హైదరాబాద్, వెలుగు:  సిటీ నడి మధ్యలో ఉండే ప్రధాన పర్యాటక ప్రాంతం​హుస్సేన్ సాగర్.  ఇది 5.7చదరపు కి.మీ పరిధిలో విస్తరించింది. సాగర్ అభివృద్ధికి ఏండ్లుగా ప్లాన్లు రూపొందిస్తున్నారు. ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదు.  బ్యూటిఫికేషన్​పేరిట సాగర్ అభివృద్ధికి  రూపొందించిన ప్రణాళికలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వస్తున్నాయి. రెండేండ్ల కిందట రూ. 2వేల కోట్లతో పలు అభివృద్ధి పనులకు హెచ్ఎండీఏ నివేదికలు సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి కేటాయింపులు లేక పనులపై ముందుకెళ్లడం లేదు. కొద్ది రోజుల కిందట ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి ప్రతి సండే పిక్నిక్​స్పాట్​గా ట్యాంక్​బండ్​ను మార్చారు. సిటీ జనాలు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడికి వచ్చే జనాలకు ఎలాంటి ఎంటర్ టైన్ మెంట్ సౌలతులైతే కనిపించడం లేదు. 

థీమ్​పార్క్​.. నైట్​బజార్​ఏర్పాటుపై..
సాగర్​ వెంట థీమ్ పార్క్, నైట్ బజార్ ఏర్పాటు చేయనున్నట్లు రెండేళ్ల కిందట హెచ్ఎండీఏ ప్రకటించింది. వీటిని10 ఎకరాల్లో జలవిహార్, పీవీ ఘాట్ మధ్యలో నిర్మించనున్నట్టు నిర్ణయించింది. రూ. 10 కోట్లతో అంచనా వేసింది. సాగర్ కట్ట వెంట ఎలివేటెడ్ వాక్ వే, అండర్ పాస్, గ్లాస్ డెక్ తోపాటు లేక్ సైడ్ డెక్, గ్రౌండ్​వంటి నిర్మించాలనే ప్రతిపాదనలు ఉండగా వాటిని హెచ్ఎండీఏ పక్కనపెట్టినట్లు తెలిసింది.  అప్పట్లో ఓ కన్సల్టెన్సీ పూర్తి వివరాలతో కూడిన ప్రాజెక్టు రిపోర్టును అందజేసింది. దీనిపై ప్రస్తుతం ఎలాంటి కదలిక లేదు. హెచ్ఎండీఏ అధికారుల పనులు స్పీడప్​కు  కృషి చేస్తున్నా  ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఏండ్లు గడుస్తున్నాయే తప్పా.. బ్యూటిఫికేషన్​ను పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. 

ఫుట్ పాత్, స్ట్రీట్ లైట్లు మినహా.. 
గడిచిన ఐదేండ్లలో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డులో కొత్తగా చేపట్టిన అభివృద్ధి పనులేవి లేవు. నెక్లెస్ రోడ్డులో వీడీసీసీ రోడ్లు,  ట్యాంక్ బండ్ పై చేపట్టిన రెయిలింగ్, ఫుట్ పాత్, స్ట్రీట్ లైట్లు మినహా కొత్తగా ఎలాంటివి చేయలేదు. ఇటీవల హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కలిసి ట్యాంక్​బండ్​పై ప్రతి సండే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి10 గంటల వరకు పిక్నిక్​స్పాట్​మార్చాయి. దీంతో పర్యాటకులు పెరిగారు. 

ప్లే స్టేషన్లు లేకపోగా..
కరోనా కారణంగా ఏడాది పాటు సాగర్ చుట్టూ ఉన్న  ఎన్టీఆర్, సంజీవయ్య, లుంబీనీ పార్కులు క్లోజ్​ అయ్యాయి. కరోనా కంటే ముందే ఆయా పార్కుల్లో ఎంటర్ టైన్ మెంట్ అందించే ప్లే స్టేషన్లు ఆగిపోయాయి. దీంతో ఫ్యామిలీతో వచ్చి సాగర్ అందాలు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటైన పిక్నిక్​స్పాట్​కు సందర్శకులు పెరుగుతున్నట్లుగానే, రిక్రియేషనల్ జోన్లను అభివృద్ధి చేస్తే మరింతగా ఆకర్షించొచ్చని పర్యాటకులు పేర్కొంటున్నారు.