రిలీజ్‌‌‌‌‌‌‌‌కు రెడీ..హీరో నవదీప్ సగిలేటి కథ

రిలీజ్‌‌‌‌‌‌‌‌కు రెడీ..హీరో నవదీప్ సగిలేటి కథ

హీరో నవదీప్ సమర్పణలో రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సగిలేటి కథ’. దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. శనివారం ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేశారు. 

సెన్సార్ పూర్తి చేసుకుని యుఏ సర్టిఫికెట్ అందుకుందని, అక్టోబర్ 6న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రం చాలా నేచురల్‌‌‌‌‌‌‌‌గా ఉందని, ఇలాంటి రూటెడ్ కథలు మునుపెన్నడూ చూడలేదంటూ సెన్సార్ సభ్యులు ప్రశంసించారని చిత్రయూనిట్ తెలియజేసింది.