సాహితీ ఇన్ఫ్రా గ్రూప్ ఎండీ లక్ష్మీనారాయణ అరెస్ట్

సాహితీ ఇన్ఫ్రా గ్రూప్ ఎండీ  లక్ష్మీనారాయణ అరెస్ట్

సాహితీ ఇన్ఫ్రా గ్రూప్ ఎండీ  లక్ష్మీనారాయణని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమీన్ పూర్ లో ప్రీ లాంచ్ పేరుతో 2500 మంది కస్టమర్ల దగ్గర సాహితీ గ్రూప్ రూ.900 కోట్లు వసూలు చేసి వెంచర్ ని స్టార్ట్ చేయలేదనే అభియోగాలు ఉన్నాయి. దీనిపై కస్టమర్ల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాజెక్ట్ ఫెయిల్ కావడంతో 18 శాతం వడ్డీతో డబ్బులు తిరిగిస్తానని లక్ష్మీనారాయణ చెక్స్ ఇచ్చారు. చెక్కులు బౌన్స్ అవడంతో సీసీఎస్ లో బాధితులు కాంప్లెయింట్ చేశారు.