శ్ర‌ద్ధా క‌పూర్ కి బ‌ర్త్ డే గిఫ్ట్: సాహో- చాప్ట‌ర్ 2 మేకింగ్ వీడియో

శ్ర‌ద్ధా క‌పూర్ కి బ‌ర్త్ డే గిఫ్ట్: సాహో- చాప్ట‌ర్ 2 మేకింగ్ వీడియో

ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా తెరకెక్కుతున్న మూవీ సాహో. ఈ రోజు శ్రద్ధాకపూర్ బర్త్ డే సందర్భంగా ‘షేడ్స్ ఆఫ్ సాహో.. చాప్టర్ 2’ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యునిట్. ఇందులో యాక్షన్ సీన్ లతో శ్రద్ధా అదరకొట్టింది. 200 కోట్లతో రూపుదిద్దుకుంటున్న సాహో సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషలలో రిలీజ్ చేయనున్నారు నిర్మాతలు. హాలీవుడ్ యాక్షన్ సీన్ లను తలపించే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సుజిత్.

సాహో మూవీలోని యాక్షన్ సన్నివేశాలకోసం అబుదాబీలో షూటింగ్ చేస్తున్నారు. 60 రోజుల ప్రాక్టీస్ తరువాత 30 రోజులు షూటింగ్ చేశారు. ఇందులో ప్రభాస్ డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాలలో నటించారు.