Allu Arjun: అనుకున్నదే అయ్యింది.. అల్లు అర్జున్ని అన్‌ఫాలో చేసిన మెగా హీరో

Allu Arjun: అనుకున్నదే అయ్యింది.. అల్లు అర్జున్ని అన్‌ఫాలో చేసిన మెగా హీరో

ఆంద్రప్రదేశ్ ఎన్నికల వేళ మరోసారి మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల మధ్య గ్యాప్ ఉందంటూ వస్తున్న వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. దానికి కారణం..  జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) కోసం మెగా ఫ్యామిలీ అంతా ప్రచారం  చేస్తే.. ఒక్క అల్లు అర్జున్(Allu Arjun) మాత్రం ఆయనకు వ్యతిరేకంగా వైసీపీకి సపోర్ట్ గా నిలిచారు. దీంతో మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు.. మెగా ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని తీవ్రగా వ్యతిరేకించారు. పార్టీలకీ అతీతంగా కేవలం ఆయనతో ఉన్న స్నేహంతోనే అక్కడికి వచ్చానని బన్నీ చెప్పుకొచ్చినా మెగా ఫ్యాన్స్ దాన్ని తీసుకోలేకపోయారు. 

ఇక జూన్ 12న జరిగిన ప్రమాణస్వీకారంలో కూడా అల్లు ఫ్యామిలీ ఎక్కడా కనిపించలేదు. దాదాపు మెగా ఫ్యామిలీ అందరు అటెండ్ అయ్యారు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరగడం అనేది నిజమే అంటూ మరికొన్ని వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక ఇదే విషయాన్నీ కన్ఫర్మ్ చేస్తూ.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ ను అన్ని సోషల్ మీడియాల్లో అన్‌ఫాలో చేశాడు. మొన్నటివరకు అన్నీ బాగానే ఉన్నా సడన్ గా ఆయన్ని అన్‌ఫాలో  చేయాల్సి అవసరం ఎందుకు వచ్చింది అంటూ నెటిజన్స్ ఆరాలు తెస్తున్నారు.

గతంలో అల్లు అర్జున్ "చెప్పను బ్రదర్ " అనే వివాదంలో కూడా హీరో సాయి ధరమ్ తేజ్ తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. స్టేజిపై అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అని కామెంట్స్ చేయగా.. సాయి ధరమ్ తేజ్ మాత్రం చెప్తాను బ్రదర్ అంటూ బన్నీకి కౌంటర్ వేశాడు. ఇక అప్పటి నుండి ఈ ఇష్యూ కొనసాగుతూనే ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ గా వెళ్లడం నచ్చకనే సాయి ధరమ్ తేజ్ ఈ పని చేసుంటాడనే కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ మెగా అభిమానుల్లో చర్చనీయాంశం అయ్యింది.