క్యారెక్టర్స్ విషయంలో నో లిమిటేషన్స్

క్యారెక్టర్స్ విషయంలో  నో లిమిటేషన్స్

తండ్రి మహేష్ మంజ్రేకర్‌‌‌‌ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ ‘దబంగ్ 3’ సినిమాతో హీరోయిన్‌‌గా పరిచయమైన సయీ మంజ్రేకర్, వరుణ్ తేజ్  ‘గని’ మూవీతో టాలీవుడ్‌‌ ఎంట్రీ ఇస్తోంది. ఏప్రిల్ 8న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా సయీ ఇలా ముచ్చటించింది. ‘నాన్న తెలుగులో చాలా సినిమాలు చేశారు. నాక్కూడా తెలుగు సినిమాలంటే  ఇష్టం. టీవీలో తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్స్ చూసేదాన్ని. ‘దబంగ్ 3’ ప్రమోషన్‌‌కు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఫ్యూచర్‌‌‌‌లో తెలుగు సినిమాలు చేస్తానని ఊహించలేదు. ఆ తర్వాత కిరణ్ కొర్రపాటి ముంబై వచ్చి ఈ స్టోరీ చెప్పగానే ఎక్సైటింగ్‌‌గా అనిపించింది. ఇందులోని ‘మాయ’ పాత్ర చాలా నచ్చింది.  బబ్లీ క్యారెక్టర్. ఎప్పుడూ హ్యాపీగా ఉంటూ తన చుట్టూ ఉన్న వారందరినీ సంతోషపెట్టే పాత్ర. రియల్‌‌ లైఫ్‌‌లోనూ అలాగే ఉంటాను. ఇక వరుణ్ చాలామంచి కో స్టార్.  ఈ సినిమా విషయంలో నాకెంతో హెల్ప్ చేశాడు. ఈ సినిమా కచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకముంది. మరోవైపు అడివి శేష్‌‌తో ‘మేజర్‌‌‌‌’లో చేస్తున్నా. తెలుగు డైలాగ్స్‌‌ను ఎలా గుర్తుపెట్టుకోవాలి, కెమెరా ముందు ఎలా ఉండాలో నాన్న చాలా సలహాలిచ్చారు. అవి ఎంతో హెల్ప్ అయ్యాయి. నా స్క్రిప్ట్ సెలక్షన్స్ విషయంలోనూ ఫైనల్ డెసిషన్ నన్నే తీసుకోమంటారు నాన్న. క్యారెక్టర్స్ విషయంలో ఎలాంటి లిమిటేషన్స్ పెట్టుకోలేదు. స్టోరీ, క్యారెక్డర్ డిమాండ్ చేస్తే గ్లామర్‌‌ షోకి కూడా రెడీ ’.