సాయి పల్లవి అమరన్ సినిమాకి ముఖ్యమంత్రి ప్రశంసలు..

సాయి పల్లవి అమరన్ సినిమాకి ముఖ్యమంత్రి ప్రశంసలు..

ప్రముఖ హీరోయిన్ సాయిపల్లవి తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కలసి జంటగా నటించన చిత్రం అమరన్. ఈ చిత్రం దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 31న ప్యాన్ ఇండియా భాషలలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాని కార్గిల్ యుద్దంలో మరణించిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ప్రముఖ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరిసామి తెరకెక్కించాడు. స్టార్ హీరో మరియు సినీ నిర్మాత కమల్ హాసన్ నిర్మించారు.

అయితే తమిళనాడు ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ తదితరుల కోసం చిత్ర యూనిట్ స్పెషల్ షో ఏర్పాటు చేశారు. దీంతో అమరన్ సినిమా చూసిన ముఖ్యమంత్రి స్టాలిన్ చిత్ర యూనిట్ ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో తన స్నేహితుడైన కమల్ హాసన్ ఆహ్వానంతో అమరన్ సినిమా చూశానని తనకి ఈ సినిమా చాలా బాగా నచ్చిందని అన్నారు. 

ALSO READ | Amaran: అమరన్ ట్విట్టర్ రివ్యూ.. శివ కార్తికేయన్, సాయిపల్లవి సినిమా టాక్ ఎలా ఉందంటే?

నేటి యువతరానికి పుస్తకాల రూపంలో – అలాగే సినిమాల రూపంలో వాస్తవ కథలను అందించడం విశేషమని దర్శకుడు కెపి రాజ్‌కుమార్ ని అభినందించారు. ఇక హీరో హీరోయిన్లుగా నటించిన శివ కార్తికేయన్, సాయి పల్లవి మేజర్ ముకుంద్ వరదరాజన్, ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలలో చక్కగా ఒదిగిపోయి తమ పాత్రలకి 100% శాతం న్యాయం చేశారని ప్రశంసించారు. దీంతో ఈ ట్వీట్ పై హీరో శివ కార్తికేయన్ స్పందిస్తూ థాంక్స్ తెలిపాడు.