
టాలీవుడ్లో విరాట పర్వం, గార్గి వంటి సినిమాల తర్వాత సాయిపల్లవి జాడ లేదు. ఆ తర్వాత ఏ ఒక్క సినిమాకు కమిట్ అయినట్టుగా న్యూస్ రాలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఎక్స్‌పోజింగ్‌కు నో అనడంతోనే సాయి పల్లవికి అవకాశాలు రావడం లేదా? లేక కావాలనే సినిమాల నుంచి ఆమెను సైడ్ చేశారా? అనే గుసగుసలు వినిపించాయి.
తాజాగా ఈ వార్తలకు ఈ హీరోయిన్ చెక్ పెట్టింది. తాను సినిమాలకు కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకోవాలని డిసైడైయ్యానని తెలిపింది. అందుకే కొత్త కథలు వినలేదట. ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ఆమె ప్రేక్షకుల ముందుకు రానుంది. శివకార్తికేయన్‌తో ఓ సినిమాలో నటించనుంది. కమల్ హాసన్ దీనిని నిర్మిస్తున్నాడు. ఈ రోల్ సాయి పల్లవి కెరీర్లో ప్రత్యేకంగా నిలుస్తుందని అంటున్నారు. ఎప్పటిలాగే కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ మరిన్ని మంచి కథలతో రావడానికి ఈ గ్యాప్‌ను ఉపయోగించుకుందట.