
మంచిర్యాల/జైపూర్(భీమారం), వెలుగు: భీమారం మండల కేద్రంలోని సాయిరాం యూత్ గణపతి ఉత్సవాలు 50 ఏండ్లకు చేరుకున్నాయి. 50వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అన్నదానం నిర్వహించారు.
ఘనంగా కుంకుమ పూజలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంజనీ పుత్ర సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడి వద్ద శుక్రవారం మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. కోలాటాలు ఆడారు. సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రజల ప్రేమతో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సుమారు 3 వేల మందికి అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో అంజనీ పుత్ర సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సూరినేని కిషన్, కాసర్ల సదానందం సిబ్బంది పాల్గొన్నారు.