సింగపూర్: చాలా కాలం తర్వాత ఫామ్‌లోకి వచ్చిన ఇండియా టాప్ షట్లర్ సైనా నెహ్వాల్.. సింగపూర్ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సైనా 21–19, 11–21, 21–17తో వరల్డ్ 9వ ర్యాంకర్, ఐదోసీడ్ హి బింగ్జియావో (చైనా)కు షాకిచ్చింది. రెండున్నర ఏళ్ల తర్వాత సైనా సూపర్–500 టోర్నీలో క్వార్టర్స్‌కు చేరడం ఇదే మొదటిసారి. మరో మ్యాచ్‌లో పీవీ సింధు 19–21, 21–19, 21–18తో తై లిహ్ ఎగుయెన్ (చైనా)పై గెలవగా, అష్మిత చాలిహా 9–21, 13–21తో హన్ యు (చైనా) చేతిలో ఓడింది. మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో హెచ్.ఎస్. ప్రణయ్ 14–21, 22–20, 21–18తో చో టియాన్ చెన్ (చైనీస్ తైపీ)ని ఓడించాడు. తొలి రౌండ్‌లో సంచలనం సృష్టించిన మిథున్ మంజునాథ్ రెండో మ్యాచ్‌లో 21–10, 18–21, 21–16తో ఎన్‌హట్ ఎంగుయెన్ (ఐర్లాండ్) చేతిలో ఓడాడు. మెన్స్ డబుల్స్‌లో అర్జున్–ధ్రువ్ కపిల, విమెన్స్ డబుల్స్‌లో పూజ దండు–ఆర్తీ సారా , మిక్స్‌డ్‌లో నితిన్–పూర్విషా జోడీలు ఓడిపోయాయి.
