వెంకిమామ నవ్వితే చాలా అందంగా ఉంటాడు..విక్టరీకి స్పెషల్ విషెష్

వెంకిమామ నవ్వితే చాలా అందంగా ఉంటాడు..విక్టరీకి స్పెషల్ విషెష్

దగ్గుబాటి వెంకటేష్ (Venkatesh)..తన పేరుకు ముందే విక్టరీ (VICTORY) అనే ట్యాగ్తో సినిమా ఇండస్ట్రీలో ఒక పదిలమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అత్యధిక నంది అవార్డులు అందుకున్నయాక్టర్గా టాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఎంత పెద్ద స్టార్ హీరోకైనా..ఫ్యాన్స్తో పాటు హేటర్స్ కూడా పెరుగుతూ వస్తుంటారు. కానీ, విక్టరీ వెంకటేష్కు మాత్రం జీరో హేటర్స్ మాత్రమే ఉంటారు. ఎందుకంటే, తన ప్రతి సినిమాతో నవ్వుతూ..నవ్విస్తాడు..ప్రేమతో కవ్విస్తాడు..ఏడుస్తూ ఏడ్పిస్తాడు..అందుకే, సినిమా సినిమాకి అందరి మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు.

వెంకటేష్కి అధ్యాత్మిక చింతన ఎక్కువ. జీసస్‌, రమణ మహర్షి, వివేకానంద, రామకృష్ణ పరమహంస, జిడ్డు కృష్ణమూర్తి తదితరుల పుస్తకాలు చదివిన తర్వాత తన జీవితం మారిపోయిందని ఓ ఇంటర్వ్యూలో వెంకటేశ్‌ తెలిపారు. అంతేకాకుండా తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని, ఒక్కరోజు కూడా ధ్యానం చేయకుండా ఉండలేననని పలు వేదికలపై వెంకటేష్ చెప్పిన విషయం తెలిసిందే. తాను హీరోగా తెరకెక్కిన తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ నుంచి ప్రస్తుతం రిలీజ్కి రెడీగా ఉన్న సైంధవ్‌ (75వ) వరకు తనదైన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువైన విక్టరీ వెంకటేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. 

వెంకీ లేటెస్ట్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ సైంధవ్‌ (SAINDHAV). హిట్‌ చిత్రాల దర్శకుడు శైలేష్‌ కొలను(Sailesh kolanu) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు వెంకట్‌ బోయనపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది విక్టరీ వెంకటేష్‌ నటిస్తున్న 75వ సినిమా కావడంతో సైంధవ్‌ పై ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాదు ఆయన నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం విశేషం.

ఇవాళ (డిసెంబర్ 13) వెంకీ బర్త్డే వెంకటేష్కు సైంధవ్‌ మూవీ టీమ్ స్పెషల్ విషెస్ తెలియజేస్తూ..వీడియో రిలీజ్ చేశారు..'సైంధవ్ టీమ్ నుండి ఇదిగో చిన్నగిఫ్ట్..ఇది మీ ముఖంలో చిరునవ్వును తెస్తుందని మేము ఆశిస్తున్నాము. అంతేకాదు మీరు నవ్వితే చాలా  అందంగా ఉంటారు' అంటూ మేకర్స్ విక్టరీకి విషెష్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇక ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, రుహాణి శర్మ, ఆండ్రియా, తమిళ హీరో ఆర్య, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.