ఆస్పత్రి నుంచి సైరాభాను డిశ్చార్జ్

V6 Velugu Posted on Sep 06, 2021

ప్రముఖ సీనియర్ నటి సైరా భాను ముంబైలోని హిందుజా ఆస్పత్రి నుంచి ఇవాళ(సోమవారం) డిశ్చార్జ్ అయ్యారు. గత నెల 28న శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు హై బీపీ, హై షుగర్ వంటి సమస్యలతో ఆమె ఆస్పత్రిలో చేరారు. సైరా భాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయాన్ని వారి కుటుంబ స్నేహితుడు ఫైసల్ ఫరూఖీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. సైరా బాను ఇంటికి వచ్చేశారని. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుందని చెప్పారు.
ఆస్పత్రిలో చేరిన మూడు రోజుల తర్వాత సైరా భానును డాక్టర్లు ICUకి తరలించారు. ఆమె పూర్తిగా కోలుకోవడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆమె వయసు 77 సంవత్సరాలు.

సైరా భాను బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ సతీమణి. ఈ ఏడాది జులైలో 98 ఏళ్ల వయసులో దిలీప్ కుమార్ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. వీరిద్దరూ కలిసి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.

Tagged hospital, discharged, Saira Banu, acute coronary syndrome diagnosis

Latest Videos

Subscribe Now

More News