‘సైయారా’ సునామీ.. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు.. లాభం ఎన్ని వందల కోట్లంటే?

‘సైయారా’ సునామీ..  రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు.. లాభం ఎన్ని వందల కోట్లంటే?

మోహిత్ సూరి ( Mohit Suri ) దర్శకత్వంలో తెరకెక్కించిన 'సైయారా' ( Sayyara ) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఊహించని స్థాయిలో అద్భుతాలు సృష్టిస్తోంది. అహాన్ పాండే ( Ahaan Panday ) , అనీత్ పడ్డా ( Aneet Padda )జంటగా నటించిన ఈ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లబిస్తోంది. జూలై 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద రూ. 507 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా విజయ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది.

బాలీవుడ్‌లో తొలిసారిగా.. 
తొలిసారి నటించిన నటీనటులతో ఇంత పెద్ద విజయం సాధించడం బాలీవుడ్‌లో ఇదే మొదటిసారి. ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసిన ' సైయారా' మరో వారం రోజుల్లో రూ. 350 కోట్ల మార్కును చేరుకుంటుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా నిలిచింది. షారుఖ్ ఖాన్ 'పఠాన్' రూ. 543.05 కోట్లు వసూలు చేయగా సల్మాన్ ఖాన్ 'టైగర్ జిందా హై' రూ. 339.16 కోట్లు రాబట్టింది.  తర్వాత 'సైయారా' నిలిచింది.

కలెక్షన్ల వర్షం.. 
కేవలం రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'సైయారా' చిత్రం థియేట్రికల్ షేర్ రూపంలో రూ. 225 కోట్లు ఆర్జించింది. దీనికి తోడు సినిమా భారీ విజయం సాధించడంతో డిజిటల్ రైట్స్ ద్వారా రూ. 25 కోట్ల నుంచి ఏకంగా రూ. 45 కోట్లు రాబట్టింది. శాటిలైట్ హక్కులు కూడా రూ. 8 కోట్ల నుంచి రూ. 15 కోట్లకు పెరిగాయి. ఈ సినిమాలో పాటలు, ముఖ్యంగా టైటిల్ ట్రాక్, చార్ట్‌బస్టర్‌లుగా నిలవడంతో మ్యూజిక్ రైట్స్ ద్వారా రూ. 50 కోట్లు అదనంగా లభించాయి. ఈ లెక్కలన్నీ కలిపి మొత్తం లాభం రూ. 290 కోట్లకు చేరింది. అంటే, పెట్టిన పెట్టుబడిపై ఏకంగా 483 శాతం లాభం చేకూరిందన్న అన్నమాట. ఇంతపెద్ద విజయాన్ని సొంతం చేసుకోవడంతో బాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash Raj Films (@yrf)