వ్యక్తిగత సమస్యలు ఉంటే వాళ్లల్లో వాళ్లు చూసుకోవాలి

వ్యక్తిగత సమస్యలు ఉంటే వాళ్లల్లో వాళ్లు చూసుకోవాలి

మంత్రి హరీష్ రావుకు, సీఎం కేసీఆర్ కు వ్యక్తిగత సమస్యలు ఉంటే వాళ్లల్లో వాళ్లు చూసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణకు సంబంధించి తామేప్పుడు కామెంట్ చేయలేదన్నారు. ముందు వాళ్ల రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.  పక్క రాష్ట్రం గురించి వారికెందుకంటూ ఫైర్ అయ్యారు. మమ్మల్ని విమర్శిస్తే తిరిగి కేసీఆర్ ను తిడతామని హరీశ్ ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటారన్నారు. తాము ఆ ఉచ్చులో పడదలుచుకోలేదని సజ్జల అన్నారు.  రెండు రాష్ట్రాల మధ్య సమస్యలపై మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.