ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటలేరు

ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటలేరు

బిజినెస్ డెస్క్, వెలుగు:కరోనా దెబ్బకు  జనం ఆదాయాలు తగ్గడంతో సహజంగానే ఖర్చులనూ తగ్గించుకుంటున్నారు. ఆటోమొబైల్స్, టెలివిజన్లు, ఎయిర్ కండిషనర్లు, స్మార్ట్ ఫోన్ల, రిఫ్రిజిరేటర్లు , వాషింగ్ మెషీన్ల  వంటి ఎలక్ట్రానిక్​ వస్తువుల కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారు. అందుకే గత నెల వీటి అమ్మకాలు ఏప్రిల్​తో పోలిస్తే 65 శాతం పడిపోయాయి. కరోనా సెకండ్‌‌‌‌ వేవ్ , తరువాత లాక్ డౌన్ల వల్ల ప్రొడక్షన్‌‌‌‌ తోపాటు, రిటైల్ ఛానల్స్ ఆగిపోయాయి. ఆటోమొబైల్ మార్కెట్ పరిస్థితి కూడా ఏమాత్రం బాగా లేదు. గత నెలంతా షోరూములు మూతబడే ఉన్నాయి. ఫ్యాక్టరీల్లో ప్రొడక్షన్ నిలిచిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌లో 2.86 లక్షల వెహికల్స్‌‌‌‌ను అమ్మితే మేలో కేవలం లక్ష వెహికల్స్ అమ్మారు.ఈ నెల అమ్మకాలు కొద్దిగా పెరవచ్చని అంచనాలు ఉన్నాయి.  "కేసులు తగ్గుతున్నాయి. మార్కెట్లను తెరిస్తే పరిస్థితి బాగుపడుతుంది. సప్లై చెయిన్ సమస్యలను తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం”అని మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీజయ్ నక్రా అన్నారు. మారుతీ సుజుకీ వంటి అనేక ఫ్యాక్టరీలు మెడికల్ ఆక్సిజన్‌‌‌‌ తయారీ కోసం ఇతర అన్ని కార్యకలాపాలను నిలిపివేశాయి. దీంతో గత నెలలో అమ్మకాలు  విపరీతంగా తగ్గాయి. 
ఫోన్ల ప్రొడక్షన్ కూడా తగ్గింది..
ఫాక్స్ కాన్, విస్ట్రాన్, ఒప్పో, వివో , శామ్​సంగ్​ వంటి చాలా పెద్ద హ్యాండ్‌‌‌‌సెట్ ఫ్యాక్టరీలు కార్మికుల కొరత కారణంగా ఈ నెలలో ప్రొడక్షన్‌‌‌‌ ను 50శాతం వరకు తగ్గించుకోవలసి వచ్చింది. డిమాండ్ మందగించడంతో ఇన్వెంటరీని పెంచుకోలేదు.  ఈ విషయమై స్ట్రాటజీ అనలిటిక్స్ సీనియర్ ఎనలిస్ట్ రాజీవ్ నాయర్ మాట్లాడుతూ ప్రస్తుత క్వార్టర్లో ఆన్‌‌‌‌లైన్ ఛానెల్స్ మొత్తం అమ్మకాల వాటా 55శాతానికి చేరుకుందని, ఆఫ్‌‌‌‌లైన్ మొబైల్​ స్టోర్లకు జనం రాక తగ్గిందని అన్నారు. ప్రస్తుత క్వార్టర్లో జూన్ వరకు స్మార్ట్‌‌‌‌ ఫోన్ల అమ్మకాలు సుమారు 2.7 కోట్ల యూనిట్ల వరకు ఉండొచ్చని అన్నారు. జనవరి-–మార్చి క్వార్టర్లో కంపెనీలు 3.8 కోట్ల ఫోన్లను అమ్మాయని తెలిపారు. ప్రస్తుత నెలలో కన్జూమర్‌‌‌‌ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులకు డిమాండ్ పెరుగుతుందని గోద్రేజ్ అప్లియెన్సెస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కూడా అయిన కమల్ నంది అన్నారు. అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్లు ఉన్నప్పటికీ, మే కంటే రిస్ట్రిక్షన్లు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. చాలా రాష్ట్రాల్లో ఇన్ఫెక్షన్ రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి ఇక నుంచి పెరుగుతాయని చెప్పారు. ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఈ నెల నుంచి రికవరీ ట్రెండ్ ఉంటుందని ఆశిస్తున్నాయి. సరఫరా చెయిన్ సమస్యల పరిష్కరించాలని, డిమాండ్ పెరుగుదలకు సహకరించాలని ఎం అండ్ ఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఆటోమోటివ్ డివిజన్) వీజయ్ నక్రా ప్రభుత్వాన్ని కోరారు. టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్  సోనీ కూడా ఇదే తరహా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ కంపెనీకి భారీగా పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయని, ఆర్డర్ క్యాన్సిలేషన్లు చాలా తక్కువని వివరించారు.
కరోనా సెకండ్ వేవ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల మార్కెట్‌‌‌‌ను ఘోరంగా దెబ్బతీసింది. గత నెలలో టీవీ లు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు , వాషింగ్ మెషీన్ల అమ్మకాలు (కన్జూమర్ గూడ్స్) ఏప్రిల్‌‌‌‌తో పోలిస్తే 65శాతం పడిపోయాయి. స్మార్ట్ ఫోన్లు అమ్మకాలు 30శాతం పైగా తగ్గి 55.6 లక్షల యూనిట్లకు పడిపోయాయని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. 
ఓపెన్ చేసిన షాపుల సంఖ్య చాలా తక్కువ
గత నెలలో 10–-15శాతం కన్జూమర్ గూడ్స్ షాపులు మాత్రమే తెరిచి ఉన్నాయి. లాక్డౌన్ కారణంగా మిగతా అన్నింటినీ మూసేశారు. రిస్ట్రిక్షన్ల కారణంగా కస్టమర్ల రాక సగం తగ్గిందని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సియమా) ప్రెసిడెంట్ కమల్ నంది అన్నారు. అనేక రాష్ట్రాలు ఆన్లైన్ షాపింగ్ ఆర్డర్ల డెలివరీలను కూడా అనుమతించలేదు. స్మార్ట్‌‌‌‌ఫోన్ల అమ్మకాలు కూడా చాలా డల్‌‌‌‌ గా ఉన్నాయి.  కౌంటర్ పాయింట్ రీసెర్చ్  డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ, డిమాండ్ , సప్లై.. రెండూ ఒకేసారి విపరీతంగా పడిపోవడంతో మే నెలలో ఫోన్ల అమ్మకాలు పడిపోయాయని అన్నారు. ఇటువంటి కష్టకాలంలో స్మార్ట్‌‌‌‌ఫోన్లు కొనడానికి చాలా మంది ఇష్టపడరని అన్నారు. కార్మికుల అనారోగ్య సమస్యల కారణంగా ఫ్యాక్టరీల్లో ఫోన్ల తయారీ కూడా తగ్గిందని ఆయన చెప్పారు.
ఏసీ కంపెనీల గోడు
గత నెలలో రూ.22 వేల కోట్ల విలువైన అమ్మకాలను ఏసీ ఇండస్ట్రీ కోల్పోయింది. సేల్స్ రికవరీ చాలా కష్టమని కంపెనీలు చెబుతున్నాయి.  కొన్ని గంటలపాటు షాపులను తెరవడానికి పర్మిషన్లు ఉన్నా, కస్టమర్లు ఎక్కువగా రావడం లేదు. జూన్ నుంచి అమ్మకాలు పెరుగుతాయని కొంతమంది అంటున్నా, కస్టమర్ల సెంటిమెంట్ బలంగా ఉండకపోవచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు.
ఆటో మొబైల్ సెక్టార్
 కార్ల అమ్మకాలు గత నెల కేవలం 1.3 లక్షల  యూనిట్లు కాగా, ఏప్రిల్​ నెలలో 2.87 లక్షల యూనిట్లను అమ్మారు. చాలా రాష్ట్రాల్లో ఆటో రిటైల్ అవుట్లెట్లు మూతబడే ఉన్నాయి. ఫ్యాక్టరీలు కూడా సరిగా నడవడం లేదు. కొన్ని చోట్ల సింగిల్ షిఫ్ట్ ప్రొడక్షన్ నడుస్తున్నది. 
స్మార్ట్‌‌‌‌ఫోన్ల మార్కెట్​ 
మేలో మొబైల్ ఫోన్ అమ్మకాలు 50శాతం పడిపోయాయి. దీంతో – 60 షిప్​మెంట్ల అమ్మకాలను కంపెనీలు నష్టపోయాయి. జనం ఆఫ్‌‌‌‌లైన్ స్టోర్స్ కు రావడం లేదు.  ఈ నెలలో కొంత రికవరీ కనిపించవచ్చని, భారీ అమ్మకాలు మాత్రం ఉండవని చెబుతున్నారు.