హైదరాబాద్, వెలుగు: టెక్ కంపెనీ సేల్స్ఫోర్స్డ్రీమ్ఫోర్స్ 2025 వార్షిక కస్టమర్ సదస్సులో ఏజెంటిక్ ఎంటర్‌ప్రైజ్ టూల్స్ సూట్‌ను విడుదల చేసింది. ఇక నుంచి మనుషులు ఏఐ ఏజెంట్లతో కలిసి పనిచేస్తారని కంపెనీ ప్రకటించింది. ప్రొడక్షన్ ఏజెంట్ ఫోర్స్ ఆధారంగా దీనిని రూపొందించామని తెలిపింది. ఏఐ ఏజెంట్లు వినియోగదారుల ప్రశ్నలకు వెంటనే స్పందిస్తాయి.
దీని వలన కస్టమర్‌కు వెయిటింగ్ సమయం తగ్గుతుంది. ఉద్యోగులు పని చేయని వేళల్లో కూడా ఏఐ టూల్స్ అందుబాటులో ఉండి, నిరంతర సేవలను అందిస్తాయి. ఏఐ టూల్స్ లీడ్‌లను విశ్లేషించి, కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వారిని గుర్తించడంలో సహాయపడతాయి. అదనపు అమ్మకాల అవకాశాలను పెంచుతాయని సేల్స్‌ఫోర్స్ తెలిపింది.
