సల్మాన్​ను కలిసి స్టెప్పులేసిన బాక్సర్ నిఖత్ జరీన్

సల్మాన్​ను కలిసి స్టెప్పులేసిన బాక్సర్ నిఖత్ జరీన్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  ఇండియా స్టార్‌‌‌‌ బాక్సర్‌‌‌‌, హైదరాబాదీ నిఖత్‌‌‌‌ జరీన్‌‌‌‌ కల నిజమైంది. తాను ఎంతగానో  అభిమానించే బాలీవుడ్‌‌‌‌ స్టార్‌‌‌‌ హీరో సల్మాన్‌‌‌‌ ఖాన్‌‌‌‌ను ఎట్టకేలకు కలుసుకుంది.  అంతేకాదు  ఖాన్‌‌‌‌తో కలిసి స్టెప్పులు వేసింది. ముంబైలో సల్మాన్‌‌‌‌ కొత్త చిత్రం కిసీ కా భాయ్‌‌‌‌ కిసీ కా సెట్‌‌‌‌కు వెళ్లిన నిఖత్‌‌‌‌.. 1991లో వచ్చిన ‘లవ్‌‌‌‌’ సినిమాలో ‘సాథియా యే తునే క్యా కియా’ అనే పాటకు ఆయనతో అందంగా డ్యాన్స్‌‌‌‌ చేసింది.

ఈ వీడియోను తన ట్విట్టర్‌‌‌‌ అకౌంట్‌‌‌‌లో షేర్‌‌‌‌ చేసిన జరీన్‌‌‌‌.. ‘ఎట్టకేలకు నా నిరీక్షణ ముగిసింది. నా కల నిజమైంది’  అని పేర్కొంది. నిఖత్‌‌‌‌కు చిన్నప్పటి నుంచి సల్మాన్‌‌‌‌ అంటే చాలా ఇష్టం. తను వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ నెగ్గినప్పుడు అభినందిస్తూ  సల్మాన్‌‌‌‌ ట్వీట్‌‌‌‌ చేశారు. తన గురించి సల్మాన్‌‌‌‌ ట్వీట్‌‌‌‌ చేశాడంటే నమ్మలేపోతున్నానని జరీన్​ చెప్పింది.  ఒక్కసారైనా సల్మాన్‌‌‌‌ను కలుసుకోవాలని ఉందని తెలిపింది. ఇప్పుడు ఆ అవకాశం ఆమెకు వచ్చింది. చెల్లి అఫ్నాన్​తో కలిసి వచ్చిన  నిఖత్​ను ఆప్యాయంగా పలుకరించిన సల్మాన్​ వారితో సెల్ఫీ దిగారు.