
రీసెంట్‌గా ‘ఖుషి’ చిత్రంలో విజయ్ దేవరకొండకు జంటగా నటించిన సమంత.. ప్రస్తుతం సినిమా లకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మయోసై టిస్‌తో బాధపడుతున్న ఆమె కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవాలనుకుని ఏడాది పాటు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ప్రస్తుతం సమంత.. వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తుం ది. అయితే ఆమె పెట్టిన ఏడాది గ్యాప్ ఇంకా పూర్తి కాక ముందే.. సమంతకు ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు జోడీగా కనిపించే చాన్స్ వచ్చిందట.
ALSO READ: ఎన్టీఆర్కు బెస్ట్ యాక్టర్గా సైమా అవార్డు
పవన్ కళ్యాణ్‌తో ‘పంజా’ సినిమాను తెర కెక్కించిన విష్ణువర్ధన్ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా, కరణ్ జోహార్ ఓ భారీ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నాడు. ఇటీవల ‘జవాన్’లో షారుఖ్ ఖాన్, నయనతార జంటకు మంచి పేరు రావడంతో ఈ చిత్రంలో సౌత్ హీరోయిన్ అయితే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడట కరణ్ జోహర్. దీనికోసం సౌత్ స్టార్ హీరోయిన్స్ సమంత, త్రిష, అనుష్క పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
వీరిలో సమంతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఏడాది గ్యాప్ తీసుకుందామనుకున్న సామ్.. ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.