HPGL సీజన్ 4: చరిత్ర సృష్టించిన సమా ఏంజిల్స్ టీం

HPGL సీజన్ 4: చరిత్ర సృష్టించిన సమా ఏంజిల్స్ టీం

హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ 4వ సీజన్ లో చాంపియన్ గా నిలవడంపై సమా టీమ్ ఓనర్ గడ్డం సరోజ సంతోషం వ్యక్తం చేశారు. మహిళా శక్తికి ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. టీమ్ సభ్యులను అభినందించారు గడ్డం సరోజ.

థాయ్ లాండ్  బ్యాంకాక్ లోని నికాంతి గోల్ఫ్ క్లబ్ లో HPGL సీజన్ 4 ఘనంగా జరిగింది. మహిళలే ఓనర్లు, కెప్టెన్ గా ఉన్న ఏకైక గోల్ఫ్ టీమ్ అయిన సమా ఏంజెల్స్..హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ లో చాంపియన్ గా నిలించింది. సంచలన ఆటతో ముందుకెళ్లిన సమా టీమ్ తొలిసారి ట్రోపీ సాధించింది. మెగా ఫైనల్లో సమా ఏంజెల్స్ 60-20 తేడాతో ఆల్ఫా టీమ్ ను ఓడించింది. 

గడ్డం సరోజా , మాధవి ఉప్పలపాటి ఓనర్లుగా, నేహా కెప్టెన్ గా ఉన్న సమా ఏంజెల్స్ గత సీజన్ లో ఆల్ఫా టీమ్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఈ సీజన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమా టీమ్ పక్కాగా ప్రిపేర్ అయింది. మొదటి నుంచే సూపర్ పెర్ఫామెన్స్ చేస్తూ వచ్చింది. తమ గ్రూప్ లో టాపర్ గా, ఓవరాల్ గా రెండో ప్లేస్ తో నౌకౌట్ కు దూసుకొచ్చింది సమా టీమ్. క్వార్టర్ ఫైనల్లో 80-0తో టూటోరూట్ ను చిత్తు చేసింది. తరువాత జరిగిన నాకౌట్ రౌండ్స్ లో అన్ని మ్యాచ్ ల్లోనూ గెలిచిన టీమ్ గా రికార్డు సృష్టించింది సమా టీమ్. సెమీస్ లో డీఎస్ఆర్ పని పట్టిన సమా టీమ్ ఇప్పుడు ఫైనల్లో టీమ్ ఆల్ఫాను ఓడించింది.