Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత

Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), స్టార్ బ్యూటీ సమంత(Samantha)ది సక్సెస్ ఫుల్ పెయిర్ అనే చెప్పాలి. వీరిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం(Rangasthalam) సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కించిన ఎమోషనల్ రివేంజ్ డ్రామాకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. బాక్సాఫిస్ దగ్గర ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా గ్రస్స్ వసూళ్లు రాబట్టి నాన్ బాహుబలి రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తరువాత మరోసారి కలిసి నటించలేదు రామ్ చరణ్, సమంత. 

తాజాగా మార్చ్ 27 రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా ఆయనకు విషెష్ తెలుపుతూ తన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు సమంత. హ్యాపీ బర్త్ డే టూ ఓజి రాంచరణ్. నీలా ఉండడం అనేది ఎవ్వరికి సాధ్యం కాదు.. అంటూ రాసుకొచ్చారు.  అయితే విషెష్ వరకు బాగానే ఉంది కానీ, ఈ పోస్ట్ లో రామ్ చరణ్ ను ఓజీ అని సంబోధించడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఓజీ అనేది పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్. ఇప్పుడు అదే పేరును రామ్ చరణ్ కు వాడటం ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. బాబాయ్ టైటిల్ తో రామ్ చరణ్ కు విషెష్ తెలపడం అనేది నెక్స్ట్ లెవల్ అంటూ  సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు మెగా ఫ్యాన్స్. ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.