
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)- సమంత(Samantha) జంటగా శివ నిర్వాణ(Shiva Nirvana) డైరెక్షన్ లో ' ఖుషీ' మూవీ తెరకెక్కుతుంది. ఇటీవలే రాజమండ్రి, ద్రాక్షరామ పరిసారల్లో క్లైమాక్స్ పార్ట్ షూట్ పూర్తి చేసుకున్నారు. తాజాగా సమంత, విజయ దేవరకొండ హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించిన వీరి ఫొటోస్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.
రీసెంట్ గా బయటికి వచ్చిన క్లైమాక్స్ పార్ట్ వీడియో లో సమంత అందానికి దిష్టి తగిలేలా చీర కట్టుతో కనిపించగా..ఇప్పుడు ఎయిర్ పోర్టు లో తన గ్రేస్, ఫ్యాషన్-ఫార్వార్డ్‌నెస్‌కి సరైన ఉదాహరణలా కనిపిస్తోంది. అభినయం, ట్రెండీ స్టైల్‌ని కంఫర్ట్‌తో కలిపి చూపించే సమంత డెనిమ్ జీన్స్ లో.. అది హైలైట్ చేసే తెల్లటి టీ షర్ట్..నల్లటి కోటు తో మెరిసింది.
ALSO READ :జైలర్ లో తమన్నా కిల్లర్ డాన్స్.. మత్తెక్కించేసిందిగా!
విజయ్ దేవరకొండ లేటెస్ట్ ట్రెండ్స్‌తో ఎప్పటికప్పుడు తన స్టైల్ లో ఫ్యాషనబుల్ డ్రెస్సెస్ తో యూత్ ను ఆకట్టుకుంటారు. ఇక ఎయిర్ పోర్టులో చాలా సింపుల్..రిలాక్స్‌డ్ గా షర్ట్ లో కనిపిస్తూ.. వావ్ అనిపించుకున్నారు. అక్కడ ఈ జంటను గమనించిన ఫ్యాన్స్ సెల్ఫీ దిగుటకు ప్రయత్నంచగా..వీరు నిశ్శబ్దంగా తమ కార్లలో బయలుదేరారు.
ఫీల్ గుడ్ ఎమోషన్ తో వస్తున్న ఖుషి మూవీలో వీరి నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వటం ఖాయమే అన్నట్టు తెలుస్తోంది. ఇదొక రియల్ ఇన్సిడెంట్ కాన్సెప్ట్ తో ఖుషి మూవీని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ మూవీ సెప్టెంబర్ 1, 2023నప్రేక్షకుల ముందుకు రానుంది.