జైలర్ లో తమన్నా కిల్లర్ డాన్స్.. మత్తెక్కించేసిందిగా!

జైలర్ లో తమన్నా కిల్లర్ డాన్స్.. మత్తెక్కించేసిందిగా!

సూపర్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్(Jailer). నెల్సన్ కుమార్(Nelsan kumar) దర్శకతం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజిని నుండి వచ్చిన గత రెండు సినిమాలు సరిగా ఆడకపోవడంతో.. జైలర్ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఏ సినిమా కోసం రజిని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా నుండి "కావాలా(Kaavaalaa)" అనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్(Anirudh) సంగీతం అందించిన ఈ పాట రికార్డ్స్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ పాటలో మిల్కీ బ్యూటీ తమన్నా(Thamannaah) వేసిన స్టెప్స్ ఐతే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. తన గ్లామర్ తో ఆడియన్స్ కు మత్తెక్కించింది ఈ బ్యూటీ. జీ కర్దా(Jee kadra), లస్ట్ స్టోరీస్2(Lust stories) వంటి సిరీస్ లో తన హాట్ హాట్ గ్లామర్ షోతో  ఆడియన్స్ ను హీటెక్కించిన తమన్నా.. ఇప్పుడు జైలర్ సాంగ్ లో తన అందాలతో కుర్రాళ్ళ మతి పోగొడుతోంది. 

ALSO READ :హైదరాబాద్ ఎయిర్ పోర్టులో సమంత, దేవరకొండ

కేవలం తమన్నా అందాలు చూసేందుకే  ఈ సాంగ్ చూస్తున్నారు చాలా మంది. కెరీర్ మొదలైనప్పటి నుండి తమన్నా ఈ రేంజ్ లో అందాల విందు చేయడం ఇదే మొదటిసారి. దీంతో ఈ సాంగ్  ను కుర్రాళ్ళు ఎగబడి మరీ చూస్తున్నారు. కేవలం సాంగ్ లోనే ఈ రేంజ్ లో అందాలు ఆరబోసిందంటే.. మరి సినిమాలో ఏ రేంజ్ లో ఉండనుంది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.